పెండింగ్ కేసులు పరిష్కరించాలి
● సీపీ గౌస్ ఆలం
హుజూరాబాద్: హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆయా పోలీస్‌స్టేషన్లలో నమోదైన పెండింగ్ కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని సీపీ గౌస్ ఆలం ఆదేశించారు. హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో డివిజన్ పోలీసులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పిటీషన్ మేనేజ్‌మెంట్ సిస్టంను సరైన పద్ధతిలో అవలంబించాలన్నారు. సీఐలు తమ పరిధిలోని పోలీసుస్టేషన్లను తరచూ సందర్శించాలన్నారు. రికార్డుల నిర్వహణ, కేసుల నమోదు వివరాలు సరైన పద్ధతిలో ఉండాలన్నారు. సీసీటీఎన్‌ఎస్, రిసెప్షన్, కోర్టుడ్యూటీ, డ్రంక్ అండ్‌డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, పాయింట్ బుక్‌ల ఏర్పాటు, సమన్ల విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్‌బియ్యం, పేకాట స్థావరాలపై నిఘా పెంచాలన్నారు. పాఠశాల, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ, సీఐలు రవి, కిషోర్, వెంకట్, సంతోష్‌కుమార్, రమేశ్, సరిలాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment