ఊరిశివార్లలో తాత్కాలిక గుడిసెలో వైద్యసిబ్బంది తనిఖీ
కర్ణాటక: స్థానికంగా ఒక కుల సంప్రదాయం ప్రకారం ప్రసవం తరువాత బాలింత, శిశువును ఆరుబయట గుడిసెలో ఉంచగా, అనారోగ్యంతో శిశువు మరణించింది. ఈ ఘటన తుమకూరు జిల్లాలోని బెళ్లావి హోబళి మల్లేనహళ్లి గ్రామం శివార్లలోని ఒక పొలంలో ఏర్పాటు చేసిన గుడిసెలో జరిగింది. చల్లటి వాతావరణం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి బాధపడుతున్న శిశువును మంగళవారం సాయంత్రం జిల్లాస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ కోలుకోలేక బుధవారం కన్నుమూసింది.
15 రోజులు శివార్లలో ఉండాల్సిందే
ఇటీవల గొల్ల సామాజికవర్గానికి చెందిన మహిళ వసంత కవల బిడ్డలకు జన్మనిచ్చింది. నెలలు గడవక ముందే జన్మించడంతో ఒక శిశువు పుట్టగానే చనిపోయింది. మరో శిశువుతో పాటు బాలింత గ్రామ శివార్లలోని ఒక గుడిసెలో కుల సంప్రదాయం ప్రకారం 15 రోజులు ఉండాలి. ఇందుకోసం కొబ్బరి మట్టెలతో చిన్న గుడిసె లాంటిది వేసి అందులో తల్లీపిల్లను ఉంచి రోజూ ఆహారం పంపించేవారు. తీవ్ర వర్షాలు, చలిగాలులకు తల్లీబిడ్డ తీవ్రంగా ఇబ్బంది పడసాగారు. ఇది తెలిసి బెళ్లావి ఆరోగ్యం కేంద్రం సిబ్బంది, వైద్యులు గుడిసె వద్దకు వెళ్లి బాలింతతో పాటు ఆ శిశును ఇంటికి పంపించేందుకు ప్రయత్నించినా తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment