
మాట్లాడుతున్న బేరి
రాయచూరు రూరల్: గ్రామాల్లో దళితులపై దాడి చేసిన అగ్రవర్ణ నిందితులను బంధించాలని దళిత ప్రగతిశీల సంఘం సంచాలకుడు బేరి డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 2న తాలూకాలోని మర్చటహాళ్‌లో దళిత రైతు నాగలి ఎద్దులతో ఇరుకు వీధిలో వెళుతుండగా అకస్మాత్తుగా రాజణ్ణ అనే వ్యక్తికి నాగలి తగలడంతో దళిత రైతును మందలించడమే కాకుండా దాడి చేసి గాయపరిచారన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నా ఇంతవరకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి నిందితులను బంధించడంలో పోలీసులు నిరక్ష్యం వహించడాన్ని ఖండించారు.