గిన్నెలో పోసిన పాలును తాగుతున్న ముంగిస
రాయచూరు రూరల్: శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజున మహిళలు భక్తిశ్రద్ధలతో వ్రతాలు, నోములను ఆచరించారు. సోమవారం నాగ పంచమి సందర్భంగా నగరంలోని నాగేష్ కట్ట వద్ద నాగ ప్రతిమలకు, పుట్టలకు మహిళలు పాలు పోసి తమ మొక్కులు తీర్చుకున్నారు.
పిల్లలకు పాలు పంపిణీ
నాగ పంచమి సందర్భంగా సోమవారం నగరంలో పద్మావతి, అంబేడ్కర్ నగర్, ఉరుకుంద ఈరణ్ణ కాలనీ, తాలూకాలోని మండలగేరలో రవి పాటిల్ ఫౌండేషన్ అధ్యక్షుడు రవి పాటిల్ పిల్లలకు పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్, రాజశేఖర్ పాటిల్, శరణు, మంజునాథ్, రాజు, రఘపతి, జంబప్ప, మునియప్పలున్నారు.
నాగేంద్ర ఆలయంలో పూజలు
కంప్లి: బుక్కసాగర గ్రామ సమీపంలోని కొండల్లో విజయనగర రాజుల కాలంలో ఏర్పాటు చేసిన ఏడు పడగల నాగేంద్రుడి ఆలయం నాగుల చవితి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ ఆలయానికి మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ రోడ్డు వేయించడంతో వాహన రాకపోకలు సునాయాసంగా సాగుతున్నాయి.
గిన్నెలో పాలను తాగిన ముంగిస
నాగుల చవితికి పాము పుట్టలు, రాతి నాగప్పలకు పాలు పోయడం ఆచారం. అయితే పాముతో పోటీ పడే ముంగిస కూడా పాలు తాగిన ఘటన హరపనహళ్లి తాలూకాలో జరిగింది. తాలూకాలోని కరిబసవేశ్వర అనే వ్యక్తి ముంగిస నిత్యం ఆహారాన్ని సేవించే వేళ గిన్నెలో పాలను పోసివ్వడంతో ముంగిస ఆ పాలు తాగింది.
Comments
Please login to add a commentAdd a comment