హంపీలో ఫలపూజ మహోత్సవం
హొసపేటె: ఫలపూజ పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి హంపీలోని శ్రీ విరుపాక్షేశ్వర ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించారు. హంపీలోని వెలసిన పురాతన కాలం నాటి విరుపాక్షేశ్వర ఆలయంలో విరుపాక్ష స్వామికి, పంపాంబిక దేవికి నిశ్చితార్థ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఫలపూజా మహోత్సవం సందర్భంగా విరుపాక్షేశ్వరుని విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. రాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు స్వామి వారికి కానుకగా అందించిన బంగారు కిరీటాన్ని స్వామి వారికి ధరించి ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవ మూర్తులను విరుపాక్షేశ్వర ఆలయం నుంచి కోదండరామ ఆలయం వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగించారు.
భక్తుల సందడితో ఆలయం కిటకిట
విద్యారణ్య భారతి స్వామీజీ సమక్షంలో కోదండరామ ఆలయంలో ఉత్సవ మూర్తులను అర్చకులు ప్రతిష్ఠించి నిశ్చితార్థం శాస్త్రోక్తంగా నిర్వహించారు. విరుపాక్షేశ్వర ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో కిటకిటలాడింది. ఫలపూజకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపోత్సవం నిర్వహించారు. ఫలపూజా మహోత్సవం సందర్భంగా శ్రీ విరుపాక్షశ్వర ఆలయంలో కార్తీక దీపోత్సవాన్ని వెలిగించారు. వణికించే చలి తీవ్రతను సైతం లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు హంపీకి చేరుకున్నారు.
విరుపాక్షేశ్వర, పంపాంబికకు
శాస్త్రోక్తంగా నిశ్చితార్థం
Comments
Please login to add a commentAdd a comment