బొమ్మనహళ్లి: భార్యకు మతిస్థిమితం సరిగా లేదని ఆమెను భవనం పై నుంచి కిందకు పడేసి హత్య చేశాడో కిరాతక భర్త. బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని సర్జాపుర వద్ద తిగరచౌడెదేనహళ్ళిలో జరిగింది. మృతురాలు మంజుల (40). భర్త మంజునాథ్ పాల వ్యాపారి. కొంతకాలంగా మంజులకు మానసిక ఆరోగ్యం సరిగా లేదు. దీంతో మంజునాథ్ ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ఆదివారం రాత్రి భార్యను భుజంపైకి ఎక్కించుకొని నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కాడు. రెండవ అంతస్తు పై నుంచి కిందకి పడేశాడు, తీవ్ర గాయాలై ఆర్తనాదాలు చేయగా స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే చనిపోయింది. సర్జాపుర పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి మంజునాథ్‌ను అరెస్టు చేశారు. హత్య దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment