● సీఎంకు కాంట్రాక్టర్ల ఫిర్యాదు
బనశంకరి: గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం కమీషన్ల బెడద అధికమైందని, అధికారులు బిల్లుల మంజూరుకు డబ్బులు అడుగుతున్నారని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆరోపించారు. సోమవారం విధానసౌధలో కాంట్రాక్టర్లు సీఎం సిద్దరామయ్య ను కలిసి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. గత బీజేపీ ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులు ఉన్నాయని, సుమారు రూ.30 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, అందులో ఏప్రిల్ నాటికి రూ.15 వేల కోట్లు విడుదలచేయాలని మనవిచేశారు. అనంతరం మంజునాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కమీషన్‌ల గోల పెరిగిందని ఆరోపించారు. సీఎం, మంత్రులు గురించి చెప్పడం లేదు, అధికారులు స్థాయిలో ఎక్కువైందని చెప్పారు. అధికారులకు సీఎం హెచ్చరించాలని డిమాండ్ చేశారు. కమీషన్లను అరికట్టకపోతే కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గేను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment