రాయచూరు రూరల్: గుర్తు తెలియని వ్యక్తులు ఓ రౌడీషీటర్‌ని హత్య చేసిన ఘటన మంగళవారం కలబుర్గిలో చోటు చేసుకుంది. మృతుడిని భవాని నగర్‌కు చెందిన వీరేష్(40)గా సబ్ అర్బన్ పోలీసులు గుర్తించారు. వీరేష్‌పై రెండు రౌడీ కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి స్నేహితులతో కలసి వీరేష్ డిన్నర్ పార్టీకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి గొడవ జరిగింది. తెల్లవారు జామున 5 గంటల సమయంలో పరిశ్రమల కేంద్రం వైపు వెళుతుండగా దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి హంతకుల కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ సంతోష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment