కన్నడ సాహిత్యంపై అవగాహన పెంచుకోవాలి
గౌరిబిదనూరు: కనకదాసు, పురంధర దాసులు కన్నడ సాహిత్య లోకానికి అనన్యమైన సేవలందించారని ఉపన్యాసకులు గిరిధర్ అన్నారు. కన్నడ సాహిత్య సుధ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఒక షోరూమ్ ఆవరణలో కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు జనార్ధనమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కన్నడ సాహిత్యం గొప్పదనాన్ని వివరించారు. రాష్ట్ర జానపద అకాడమీ ప్రశస్తి పొందిన గొట్లగుంటె వెంకటరమణప్ప, సూర్య ప్రకాశ్, కుసుమా సూర్య ప్రకాశ్‌ను సన్మానించారు. కార్యదర్శి హెచ్‌ఎల్‌వీ వెంకటేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment