మహిళా దొంగ అరెస్టు
తుమకూరు: బస్సు ప్రయాణికుల నగలు, డబ్బు కొట్టేస్తున్న మహిళా దొంగను హుళియారు పోలీసులు బంధించి రూ.10.05 లక్షల విలువ చేసే బంగారు నగలను స్వాధీనపరచుకున్నారు. నిందితురాలు కొరటగెరె బోవి కాలనీకి చెందిన అలివేలమ్మ (25). జిల్లాలో చాలా చోట్ల అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్లు తెలిపింది. 2024 డిసెంబర్ 9న తిపటూరు తాలూకా గౌడనకట్టెకు చెందిన రాజేశ్వరి అనే మహిళ హుళియారు బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా అలివేలమ్మ నగలను దోచుకుంది. కేసు నమోదు చేసుకున్న హుళియారు పోలీసులు నిందితురాలిని గుర్తించి అరెస్టు చేశారు.
మహిళా దొంగ అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment