రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రీషియన్ మృతి
మాలూరు : క్యాంటర్ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈఘటన తాలూకాలోని చిక్కతిరుపతి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. బెంగుళూరు రూరల్ జిల్లా పణత్తూరు దిన్నెకు చెందిన చరణ్‌రాజ్ (22) ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటాడు. ఎప్పటి లాగా పని ముగించుకుని చిక్కతిరుపతి గ్రామ పంచాయతీ కల్కెరె గ్రామానికి చెందిన శ్రీధర్‌తో కలిసి బైక్‌లో వెళ్తుండగా సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న క్యాంటర్ ఢీకొంది. ఘటనలో చరణ్‌కాజ్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన శ్రీధర్‌ను ఆస్పత్రికి తరలించారు. లక్కూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment