భక్తిశ్రద్ధలతో నంజుండేశ్వర స్వామి జయంతి
కోలారు : శ్రీ కంఠ శివాచార్య గురు జయంతి మహోత్సవం కోలారు నగరంలోని ప్రసన్న శ్రీ నంజేడేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం శ్రీ మహాగణపతి ప్రార్థన, మహన్యాస పారాయణం, పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, విశేష అలంకరణ, మహామంగళారతి, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. వేద విద్యాంసుల ఆధ్వర్యంలో వేదమంత్ర పారాయణం జరిగింది. అన్ని శైవ దీక్షా కుటుంబాలు పూజా కార్యక్రమంలో పాల్గొన్నాయి. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
కోదండరామ స్వామికి పూజలు
మాలూరు: సుమారు 200 సంవత్సరాల ఇతిహాసం కలిగిన లక్కూరు గ్రామంలోని పురాతన శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని ఇటీవల గ్రామస్తులు జీర్ణోద్ధరణ చేసి నూతన విమాన గోపురం నిర్మించారు. ఈ సందర్భంగా మంగళవారం దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలను నిర్వహించారు. వైఖానుస భాగవత్ శాస్త్రాను సారంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు.
భక్తిశ్రద్ధలతో నంజుండేశ్వర స్వామి జయంతి
Comments
Please login to add a commentAdd a comment