విద్యారంగానికి 30 శాతం నిధులివ్వాలి
కోలారు : బడ్జెట్‌లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు మంగళవారం నగరంలోని తహసీల్దార్‌కార్యాలయం ముందు ప్రతిఘటన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి సురేష్‌బాబు మాట్లాడుతూ విద్యారంగంలో నానాటికీ నాణ్యతా ప్రమాణాలు తగ్గిపోతున్నాయన్నారు. ప్రభుత్వాలు విద్య రంగాన్ని ర్లక్ష్యం చేయడంతో కార్పొరేట్ విద్య విస్తరిస్తోందన్నారు. ఫలితంగా రైతు, కార్మిక దళత, వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను పొందలేక పోతున్నారన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు నిధులు పెంచాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు జీ శశికుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహ కార్యదర్శి హర్షిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment