మెట్రో బండి.. మేము రామండీ
బనశంకరి: అత్యాధునిక రవాణా వ్యవస్థ, సిగ్నల్స్, ట్రాఫిక్ జామ్‌ల బెడద లేకుండా సులభంగా గమ్యానికి చేరుకోవచ్చు అని నగరవాసులు సంతోషిస్తే, చార్జీల బాదుడు పిడుగులా పడింది. సిలికాన్ సిటీలో మెట్రో రైలు టికెట్ ధరల పెంపు (బీఎంఆర్‌సీఎల్) అనేది ప్రయాణికులపై చాలా ప్రభావం చూపించింది. గత నెలలో సుమారు 40 లక్షల మంది ప్రయాణికులు మెట్రో నుంచి దూరంగా ఉన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన బీఎంఆర్‌సీల్ మెట్రో టికెట్ ధరలను కనిష్టంగా 33 శాతం నుంచి గరిష్టం 50గా శాతం పెంచింది. కొన్ని మార్గాల్లో అయితే కంగా 100 శాతం హెచ్చించింది. ప్రయాణికులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మరీ ఎక్కువగా పెంచిన మార్గాల్లో కొంతమేర కోత కోసింది.
రోజువారీగా తగ్గుదల ఇలా
కానీ ప్రయాణికుల్లో ఆగ్రహం మాత్రం తగ్గడం లేదు. మెట్రోలో ప్రయాణించకుండా నిరసనను వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో నిత్యం 8.02 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో ప్రయాణించేవారు, ఇప్పుడు 7.46 లక్షలకు తగ్గింది. జనవరిలో మెట్రోలో 2.49 కోట్ల మంది ప్రయాణిస్తే, ఫిబ్రవరిలో ఆ సంఖ్య 2.09 కోట్ల మందికి పరిమితమైంది. ప్రయాణికులు తగ్గినప్పటికీ చార్జీల పెంపు వల్ల మెట్రో ఆదాయం తగ్గకపోగా నష్టం కూడా రాలేదు. ఫిబ్రవరి 9 నాటికి నిత్యం ప్రయాణికుల సంఖ్య సరాసరి 8 లక్షలకు పైనే ఉండేది. ఫిబ్రవరి 23వ తేదీన 4.94 లక్షల మంది మాత్రమే రైలెక్కారు. ఇది ఏడాదిన్నర కాలంలోనే అత్యంత తక్కువమంది ప్రయాణికులు ప్రయాణించిన రోజు కావడం విశేషం.
వృద్ధి నుంచి క్షీణతకు
నమ్మమెట్రో చల్లఘట్ట–వైట్‌ఫీల్డ్ (గ్రీన్‌మార్గం) నాగవార– సిల్క్‌బోర్డు మార్గంలో పూర్తి స్థాయిలో రైళ్లు ప్రారంభం కావడంతో ప్రతి నెలా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టికెట్ ధరల పెంపుతో వారి సంఖ్య బాగా పడిపోయింది. 2023 డిసెంబరులో 2.13 కోట్ల మంది ప్రయాణం చేశారు. అది అలాగే కొనసాగింది. ఈ ఏడాది జనవరిలో 2.49 కోట్ల మంది మెట్రో సేవలను పొందారు. కానీ ఫిబ్రవరిలో టికెట్ ధరల పెంపుతో ఈ సంఖ్య 2.09 కోట్లకు క్షీణించింది.
తీవ్రంగా చార్జీల పెంపు ఎఫెక్టు
బెంగళూరువాసుల అసహనం
తగ్గిన 40 లక్షల మంది ప్రయాణికులు
తగ్గించాలని డిమాండ్లు
మెట్రో టికెట్ ధరల పెంపుపై ఇప్పటికీ వ్యతిరేకత వస్తోంది. ధరలను తగ్గించాలని వివిధ సంఘాలు, పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అంతేగాక రానున్నరోజుల్లో పోరాటం తీవ్రతరం చేయడం గురించి ప్రణాళిక రూపొందించారు. సోషల్ మీడియాలో నిత్యం చార్జీల వడ్డనపై చర్చ జరుగుతూనే ఉంది. మెట్రో చార్జీల సమస్య గురించి విధానసభలో చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ సహా బీజేపీ, జేడీఎస్ దీనిపై గతంలో గళమెత్తాయి.
మెట్రో బండి.. మేము రామండీ
మెట్రో బండి.. మేము రామండీ
Comments
Please login to add a commentAdd a comment