ప్రతిపక్షం.. లైవ్‌లో నిర్లక్ష్యం
శివాజీనగర: శానసభా కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంలో విపక్ష సభ్యులను నిర్లక్ష్యం చేస్తున్నారు, వారివైపు కెమెరాలను ఫోకస్ చేయడం లేదని మంగళవారం విధానసభలో వాగ్వివాదం నెలకొంది. ఫలితంగా గందరగోళం ఏర్పడి సభను కొంతసేపు వాయిదా వేయాల్సి వచ్చింది.
ఎందుకు చూపడం లేదు
బడ్జెట్ సమావేశాలు రెండవరోజుకు చేరుకోగా, ప్రశ్నోత్తరాలు ముగిశాక బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్, కర్ణాటక పబ్లిక్ కమిషన్‌లో కన్నడ భాష నగుబాటు అయ్యిందంటూ వాయిదా తీర్మానం కింద మాట్లాడబోయారు. బీజేపీ పక్ష ఉప నేత అరవింద బెల్లద్ స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల లైవ్‌లో మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. నిలబడి మాట్లాడుతున్నా లైవ్‌లో చూపించటం లేదు. ఇది సరికాదు. సోమవారమే చెప్పాం. ప్రభుత్వ ధోరణి సరికాదని ఘాటైన స్వరంతో అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ కూడా ఇదే ఆరోపణ చేశారు. లైవ్ కాంట్రాక్టును ఓ కాంగ్రెస్ కార్యకర్తకు అప్పగించారని తెలిసిందని, ఇది సరికాదని బెల్లద్ చెప్పగా, అధికార పార్టీ సభ్యులంతా లేచి నిలబడి వ్యతిరేకించారు. వాగ్వివాదం పెరిగి ఆరోపణలు చేసుకున్నారు. కేకల మధ్యలో మాట్లాడిన మంత్రి ప్రియాంక ఖర్గే, పార్లమెంట్‌లో ఏమి చేశారో తెలుసు, తామేమీ కొత్తగా చేయలేదని అన్నారు.
నట్లు లూజయ్యాయా?
స్పీకర్ యూటీ ఖాదర్ స్పందిస్తూ, నేను చూస్తున్నాను. టెక్నికల్‌గా ఏమి సమస్య ఉందనేది గమనించి సరిచేస్తానని సర్దిచెప్పబోయారు. ప్రతిపక్ష సభ్యులు ఇప్పుడే అన్నింటినీ సరిచేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యుడు సునీల్‌కుమార్ ఎక్కడైనా నట్లు బోల్ట్‌లు లూజయ్యాయా అని అనడంతో మళ్లీ వాగ్వివాదం నెలకొంది. స్పీకర్ చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆర్.అశోక్ మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులను నిర్లక్ష్యం చేయటం సరికాదని అన్నారు. గొడవ తగ్గకపోవడంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
నేరాలు తగ్గాయి: హోంమంత్రి
యశవంతపుర: సైబర్ క్రైమ్ మినహా రాష్ట్రంలో ఏడాది నుంచి నేరాల సంఖ్య బాగా తగ్గినట్లు హోంమంత్రి జీ పరమేశ్వర్ విధానసభలో తెలిపారు. మత్తు పదార్థాలతో జరిగే అనర్థాలపై బడులు, కళాశాల విద్యార్థులకు జాగృతి చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి, హఫీము, మట్కా, దోపిడీలు, నాటుసారా, వాహన చోరీలు తదితరాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. రాత్రి సమయంలో గస్తీని పెంచాం. డీఎస్పీ పోస్టుల నియామకం పరిశీలనలో ఉంటుందన్నారు.
మావైపు కెమెరాలు ఫోకస్ చేయడం లేదు
విధానసభలో బీజేపీ సభ్యుల ధ్వజం
ఉభయ పక్షాల తీవ్ర వాగ్వాదం
ప్రతిపక్షం.. లైవ్‌లో నిర్లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment