మైనార్టీ విద్యార్థులకు సమాన ప్రాధాన్యత
హొసపేటె: కన్నడ యూనివర్సిటీలోని ఇతర విద్యార్థులతో సమానంగా మైనార్టీ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని కన్నడ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ డీవీ పరశివమూర్తి పేర్కొన్నారు. కన్నడ యూనివర్సిటీ, హంపీ మైనార్టీ పోస్ట్‌మెట్రిక్ బాలుర హాస్టల్‌ను బుధవారం ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. దేశంలో మైనార్టీలకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నాయన్నారు. కన్నడ విశ్వవిద్యాలయ విద్యార్థి సంక్షేమ అధికారి డాక్టర్ వెంకటగిరి దళవాయి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
పశువుల రవాణాకు బ్రేక్
మైసూరు: గూడ్స్ వాహనంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన అశోకపురం స్టేషన్ పోలీసులు నాలుగు పశువులను రక్షించారు. నగరంలోని శ్రీరాంపురం మానందవాడి రోడ్డులో గస్తీలో ఉండగా గూడ్స్ వాహనంలో పశువులను తరలిస్తున్నట్లు చూశారు. వాహనాన్ని ఆపి పరిశీలించగా, అందులో నాలుగు పశువులు కనిపించాయి. కబేళాకు తరలిస్తున్నట్లు డ్రైవర్, మరొకరు తెలిపారు. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు.
గంజాయి, లాటరీలు సీజ్
మండ్య: గంజాయి విక్రయిస్తున్న అగసనపురకు చెందిన ఉమేశ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మళవళ్లి తాలూకా నిడఘట్ట గేట్ వద్ద ఉండగా పట్టుకుని కొంత గంజాయిని సీజ్ చేశారు. అలాగే మళవళ్లి తాలూకా కిరుగావలు బస్టాండ్ సర్కిల్ వద్ద కేరళ రాష్ట్ర లాటరీ టికెట్లను టి.నరసీపుర తాలూకా హెగ్గూరికి చెందిన నాగేగౌడ అనే వ్యక్తి విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. 36 కేరళ లాటరీ టికెట్లు, రూ. 4,200 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment