పెన్షన్ పెంచాలని ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్రంలో శ్మశానంలో విధులు నిర్వహించే కాటికాపరులకు బడ్జెట్‌లో పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచాలని, వేతనాలు పెంచాలని కాటికాపరుల విమోచన సంఘం అధ్యక్షుడు వీరేష్ డిమాండ్ చేశారు. బుధవారం తాలూకా పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. ఏళ్ల తరబడి కాటికాపరుల సమీక్ష చేపట్టడంలో అధికారులు విఫలం అయ్యారని ఆరోపించారు. వారికి రెండు ఎకరాల భూమితో ఇల్లు కట్టుకోడానికి నిధులు మంజూరు చేయాలన్నారు. స్వయం ఉపాధితో రూ.25 వేల సహాయధనం ఇవ్వాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
ఇరు వర్గాల ఘర్షణ..
వ్యక్తి హత్య
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా మల్లినమడుగు గ్రామ పంచాయతీలో సర్కార్ నిధులతో చేపట్టిన పనుల పేరుకు బోర్డు పెట్టరా? అని అడిగినందుకు ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. జీపీ సభ్యురాలు నాగమ్మ భర్త వెంకోబ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ విడిపించడానికి ప్రయత్నించిన వీరేష్(40)ను హత్య చేశారని మాన్వి సీఐ హిరేమఠ్ వెల్లడించారు. వెంకోబ వర్గీయులు కత్తులు, గొడ్డళ్లు, చాకులతో దాడి చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయన్నారు. గాయపడ్డ వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఏబీసీడీ వర్గీకరణకు వినతి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం స్పందించాలని దళిత ఐక్య పోరాట సమితి సంచాలకుడు మారెప్ప డిమాండ్ చేశారు. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. డాక్టర్ నాగ మోహన్ దాస్ కమిటీకి నివేదిక ఆధారంగా రూపొందించిన వినతిపత్రాన్ని సమర్పించారు. 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని పోరాడినా కాంగ్రెస్ సర్కార్ వర్గీకరణ చేయడంలో నిర్లక్ష్యం చేయడాన్ని ఖండించారు. మాదిగలకు విద్య, ఆర్థిక, ఉద్యోగ పరంగా ప్రాతినిథ్యం లేక పోవడం కారణమంటూ మాజీ మంత్రి మాధుస్వామి ఇచ్చిన నివేదికను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో హేమరాజ్, హులిగప్ప శ్రీనివాస్, ఈరణ్ణలున్నారు.
సేవాతత్పరత అవసరం
రాయచూరు రూరల్: ప్రతి ఒక్కరూ సేవాతత్పరతను పెంచుకోవాలని బాగల్‌కోటె ప్రభు స్వామి చరంతిమఠ పిలుపునిచ్చారు. బాగల్‌కోటలో జాతీయ స్వయం సేవక్ సంఘం సేవా భారతి ఆశ్రమాన్ని ప్రారంభించి భక్తులనుద్దేశించి ప్రసంగించారు. అవిభాజ్య విజయపుర, బాగలకోటె జిల్లాలో 1940 నుంచి సంఘ్ కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు తెలిపారు. 2008 నుంచి సేవా భారతి ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలిపారు. సమాజం చెడు మార్గం వైపు పయనిస్తున్న సమయంలో హిందూ సనాతన సంప్రదాయాలను బోధించడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ సంచాలకులు మంగేష్‌జీ భండే, బసవరాజ్ డంబల్, చిదంబర కర్మకర్, చంద్రశేఖర్ దొడ్డమని, సుభాష్ పాటిల్, రఘు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో తనిఖీ
హొసపేటె: నగరంలోని బళ్లారి రోడ్డులోని సంకలాపురలో అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం తహసీల్దార్ శృతి మల్లప్పగౌడ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో ఆహార ధాన్యాలను పరిశీలించారు. అదే విధంగా పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు నాణ్యతమైన విద్యను బోధించాలని తెలిపారు.
పెన్షన్ పెంచాలని ధర్నా
పెన్షన్ పెంచాలని ధర్నా
పెన్షన్ పెంచాలని ధర్నా
Comments
Please login to add a commentAdd a comment