ఘనంగా అబ్బె తుమకూరు జాతర
రాయచూరు రూరల్: యాదగిరి తాలూకా అబ్బె తుమకూరు పండితారాధ్య రథోత్సవం, జాతర ఘనంగా జరిగింది. శనివారం రాత్రి ఆలయం వద్ద విశేష పూజలు జరిపి వేలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేత్రపర్వంగా శరణ బసవేశ్వర రథోత్సవం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా అమలాపుర గ్రామంలో వెలసిన శరణ బసవేశ్వర స్వామి వారి రథోత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం ఆలయం నుంచి సకల వాయిద్యాలతో పాటు పల్లకీలో శరణ బసవేశ్వర స్వామి విగ్రహాన్ని రథంపైకి తీసుకొచ్చి మూడు ప్రదక్షిణల అనంతరం రథంలో ప్రతిష్టించారు. స్వామి వారి రథం ఎక్కగానే తరలివచ్చిన భక్తులు, అమలాపుర గ్రామస్తులు శరణ బసవేశ్వరుని రథం పైకి అరటిపండ్లు విసిరి భక్తిని చాటారు. పలు గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ప్రముఖ సిద్ధాంతి కన్నుమూత
బళ్లారిఅర్బన్: నగరంలో ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితుడిగా, ముఖ్యంగా సీతారామ ఆశ్రమం ట్రస్ట్ అధ్యక్షుడిగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న నేతి సీతారామయ్య శర్మ సిద్ధాంతి(73) మంగళవారం రాత్రి కన్నుమూశారు. హవంబావి రామనగర్ రెండో క్రాస్‌లోని ఆయన స్వగృహంలో అంతిమ దర్శనానికి బంధువులు ఏర్పాట్లు చేశారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా. హనుమంతపురం అగ్రహారం గడ్డిపాడులో 1952 జూలై 2న నేతి లక్ష్మీ నరసింహారావు, నేతి అలిమేలు మంగతాయారు దంపతులకు 6 మంది సంతానంలో రెండో కుమారుడుగా జన్మించారు. 1978లో బళ్లారి జిల్లా హొసపేటె తాలూకా దేవసముద్ర క్యాంప్‌లో శ్రీకోదండరామ దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఇక్కడికి విచ్చేశారు.
నృత్య ప్రదర్శనలో
నాట్యకారుల ప్రతిభ
గౌరిబిదనూరు: తమిళనాడులోని తంజావూరులో మంగళవారం రాత్రి బృహన్ నాట్యాంజలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బృహదీశ్వరాలయ ఆవరణలో జరిగిన నాట్య ప్రదర్శనలో పట్టణానికి చెందిన నాట్య కళాకారులు ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు. దిక్సూచి నాట్యాలయకు చెందిన హారిప్రియ, సృజన, మీనాక్షి, శుశ్మితశ్రీ,మానసలు పుష్పాంజలి, నటేశ కౌస్తుభం, లింగాష్ఠకం, శివపదం, ఽథిల్లాన నృత్యాన్ని ప్రదర్శించారు. వీరికి మృదంగంలో సతీశ్, వేణువు రమేశ్, ఒకల్ మిర్లాని, నషువాంగంలో హరిప్రియలు సహకరించారు. కార్యదర్శి ముత్తుకుమార్ పాల్గొన్నారు.
క్షతగాత్రుడి మృతి
మండ్య: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మార్టళ్లి గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ (20) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. గతేడాది నవంబర్ 1న రాత్రి 10.30 గంటల సమయంలో కనకపుర వైపు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీ కొట్టింది.బైక్ వెనుక సీట్లో కూర్చొన్న అరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మైసూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతి చెందాడని హలగూరు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఘనంగా అబ్బె తుమకూరు జాతర
ఘనంగా అబ్బె తుమకూరు జాతర
Comments
Please login to add a commentAdd a comment