గ్యారెంటీలు.. విద్యుత్ ఉద్యోగులకు శాపాలు
రాయచూరు రూరల్: నగర, గ్రామీణ ప్రాంతాల్లో పంచ గ్యారెంటీల అమలుతో ఆర్టీసీ నష్టాల బాట పట్టగా, విద్యుత్ శాఖ పరిధిలోని నాలుగు విద్యుత్ సరఫరా మండలి(ఎస్కాం) సంస్థలకు కూడా షాక్ తగిలింది. సర్కార్ అమలు పరచిన శక్తి పఽథకం తరువాత విద్యుత్ శాఖ నిర్వీర్యం అవుతోంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఆర్టీసీ నష్టాల బాటలోకి వెళ్లింది. అదే బాటలో ఎస్కాం సంస్థలు పయనిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం ఉచిత గ్యారెంటీలకు వ్యతిరేకం అని చెప్పినా నిపుణుల అభిప్రాయాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించలేదు. బస్ టికెట్ ధరలు ఒకటిన్నర శాతం పెంచారు. ఎస్కాంలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉద్యోగులకు పీఎఫ్, జీపీఎఫ్, ఇంధన వ్యయం, గ్రాచ్యుటీ, వేతన బకాయిలు, ఇతరత్ర కలిపి రూ.2,850 కోట్ల మేర నష్టాల బాటలో సంస్థలున్నాయి. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఖజానాను భర్తీ చేయడం కోసం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో నుంచి ఐదు శాతం ఇవ్వాలని ప్రతిపాదనలతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి లేఖ రాసినట్లు సమాచారం. రాష్ట్రంలో 2.5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులున్నారు. దీని కోసం ప్రత్యేక నిధిని స్థాపించడానికి ప్రతిపాదనలను రూపొందిస్తోంది. ఈ విషయంలో మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యుల వేతనాల్లో నుంచి కూడా ఐదు శాతం కోత విధిస్తే పంచ గ్యారెంటీల అమలుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చార్జీలు పెంచినా నష్టాల ఊబిలో
కూరుకున్న ఎస్కాంలు
ఉద్యోగుల వేతనాల్లో ఐదు శాతం
చెల్లించాలని ప్రతిపాదన
Comments
Please login to add a commentAdd a comment