వేసవికి ముందే ఉ–కకు జల క్షామం?
రాయచూరు రూరల్: గత ఏడాది రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసినా వేసవిలో ఉత్తర కర్ణాటక(ఉ–క)కు జల క్షామం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విజయపుర జిల్లాలోని ఆల్మట్టి డ్యాంలో ఆశించినంత మేర నీరు అందుబాటులో లేవనే విషయం తేటతెల్లమవుతోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉంది. డ్యాం గరిష్ట మట్టం 519.60 మీటర్లు, 123.081 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 513.70 మీటర్లు, 52.424 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 17.62 టీఎంసీలు పోను మిగిలిన 34.804 టీఎంసీల నీటిని ఈ నెలాఖరు వరకు కాలువలకు వదలాలి. గత ఏడాది 516.08 మీటర్లు, 73.838 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. ఈ ఏడాది డ్యాంలో 21.414 టీఎంసీల నీరు తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్, మే, జూన్ వరకు ఆల్మట్టి జలాశయం నుంచి విజయపుర, బాగల్‌కోటె, యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాల్లో తాగునీటి పథకాలకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. గతంలో రైతుల కోరిక మేరకు నీటి వాటా లభ్యత ఆధారంగా రబీ సీజన్‌లో వేసుకున్న పంటలకు నీటిని విడుదల చేస్తామని కేబీజీఎన్‌ఎల్ చీఫ్ ఇంజినీర్ సురేష్ వెల్లడించారు.
ఆల్మట్టి డ్యాంలో తగ్గిన నీటి నిల్వలు
తాగునీటి పథకాలకు తప్పని ఇబ్బందులు
వేసవికి ముందే ఉ–కకు జల క్షామం?
Comments
Please login to add a commentAdd a comment