ఎంసీహెచ్‌తో వైద్య సేవల ఒప్పందం
రాయచూరు రూరల్: బాలింతలు, శిశు మరణాల తగ్గింపునకు నవోదయ వైద్య కళాశాల, ప్రభుత్వ తల్లీబిడ్డల ఆస్పత్రి(ఎంసీహెచ్) మధ్య ఒప్పందం కుదుర్చుకొని సంస్థ నుంచి వైద్యులను, సిబ్బందిని పంపుతున్నట్లు నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్.రాజేంద్రరెడ్డి వెల్లడించారు. బుధవారం నవోదయ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 33 ఏళ్లుగా జిల్లా ప్రజలకు వైద్య పరంగా సేవలందిస్తున్నారన్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో గర్భిణులు ప్రసవం కోసం వచ్చే వారికి 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నవోదయ ఆస్పత్రిలో తాయి మడిలు కిట్లు అందించామన్నారు. నవోదయ విద్యార్థులు క్రీడల్లో, విద్యాభ్యాసంలో రాణించారన్నారు.
నేటి నుంచి రీగల్ ఉత్సవాలు
ఈనెల 6 నుంచి మూడు రోజుల పాటు నవోదయ వైద్య కళాశాలలో రీగల్– 2025 ఉత్సవాలకు కర్ణాటక మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగానంద శ్రీకారం చుడతారన్నారు. 7న స్నాతకోత్సవాన్ని ముంబై క్యాండీ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ఆనంద్‌రావ్ ప్రారంభిస్తారన్నారు. 8న భారతీయ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు దిలీప్ కుమార్ నర్సింగ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారన్నారు. సాయంత్రం ఇఫోరియ ఉత్సవాలు, నవోదయ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, ఆరోగ్య అంశాలపై ప్రచారం కోసం నవోదయ రేడియో స్టేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో 3869 మందికి తల్లి మడిలు కిట్లతో పాటు రూ.3 వేల పారితోషికం అందించామన్నారు. 17,748 మందికి ఫిజియోథెరపి చేశామన్నారు. 136 ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య శిబిరాల్లో 28,591 మందికి వైద్య సేవలందించామన్నారు. శ్రీనివాస్, దేవానంద్‌లున్నారు.
బాలింతలు, శిశు మరణాల తగ్గింపునకు చర్యలు
నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ
ఎస్.రాజేంద్రరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment