వేడుకగా పాదుకా పట్టాభిషేకం
రాయచూరు రూరల్: మంత్రాలయంలో గురు రాఘవేంద్రుల పాదుకా పట్టాభిషేక ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. గురువారం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో మూల విరాట్‌కు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రత్యేక పూజలు చేశారు. వారం రోజుల పాటు గురుసార్వభౌముల 404వ పట్టాభిషేక ఉత్సవాలు, రాయల 430వ వర్థంతి స్మరణోత్సవ వేడుకల్లో వందలాది భక్తుల సమక్షంలో రథోత్సవాలు జరిపారు. కాగా మంత్రాలయం గురు సార్వభౌమ అవార్డులను ఐఏఎస్ అధికారులు, కర్ణాటక దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారి వెంకటేష్, న్యూఢిల్లీకి చెందిన మోహన్ కృష్ణ సింగ్, కర్ణాటక ప్రైవేట్ చానల్ రిపోర్టర్ రవికుమార్‌లకు సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ అందించారు.
భక్తిశ్రద్ధలతో రాఘవేంద్రుని పట్టాభిషేకం
బళ్లారి అర్బన్: కలియుగ కామధేనువు, కల్పవృక్షం రాఘవేంద్ర తీర్థ గురుసార్వభౌముల పట్టాభిషేకం, వర్థంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణపేటలో వెలసిన రాఘవేంద్ర స్వామి మఠం, తేరు వీధిలోని రాఘవేంద్రుని సన్నిధిలో వివిధ పూజా కార్యక్రమాలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జామున విశేష పూజలు, అర్చనలు, ప్రత్యేక అలంకారాలు, మహా నైవేద్యం, మహా మంగళ హారతితో పాటు వివిధ పూజలను భక్తిప్రపత్తులతో నెరవేర్చారు. స్థానికులతో పాటు వివిధ చోట్ల నుంచి రాఘవేంద్రస్వామి భక్తులు విశేషంగా తరలి వచ్చి ఈ ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్నారు. కాగా సత్యనారాయణపేట రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఈనెల 1 నుంచి 6 వరకు నిత్యం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రీమఠం, శ్రీమధ్వ సంఘం ఆధ్వర్యంలో వివిధ పండితులతో రాఘవేంద్ర విజయ ప్రవచనం ఆసక్తికరంగా సాగింది. ఈసందర్భంగా భక్తులకు విశేష తీర్థ ప్రసాదాల పంపిణీని కూడా నెరవేర్చారు.
మంత్రాలయంలో ముగిసిన ఉత్సవాలు
గురు సార్వభౌమ అవార్డులు ప్రదానం
వేడుకగా పాదుకా పట్టాభిషేకం
వేడుకగా పాదుకా పట్టాభిషేకం
వేడుకగా పాదుకా పట్టాభిషేకం
వేడుకగా పాదుకా పట్టాభిషేకం
వేడుకగా పాదుకా పట్టాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment