మాలూరు: చిక్కతిరుపతి ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. గత మూడునెలల్లో స్వామివారికి కానుకల రూపంలో రూ.49.09 లక్షల మేర ఆదాయం లభించింది. ఇంకా అన్నదాసోహ హుండీ లెక్కింపు మిగిలి ఉంది. హుండీలో నగదుతోపాటు బంగారు, వెండి, విదేశీ కరెన్సీ లభించింది. తమ కోరికలు తీర్చాలని భక్తులు రాసిన చీటీలుకూడా హుండీలో లభించాయి. ఉదయం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం తహసీల్దార్ ఎంవీ రూప, జిల్లా దేవదాయ శాఖ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఈఓటీ సెల్వమణి సమక్షంలో హుండీలను లెక్కించారు. అనంతరం హుండీ డబ్బును దేవాలయ బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment