కసాప సేవలు అనన్యం
రాయచూరు రూరల్: 14 సార్లు జ్ఞానపీఠ అవార్డులందుకున్న కన్నడ భాషకు ప్రాణం పోసిన కన్నడ సాహిత్య పరిషత్ సేవలు అనన్యమని, కన్నడ భాషకు మరింత ఆదరణ లభించాలని 87వ అఖిల భారత సర్వ సమ్మేళనాధ్యక్షుడు గోరూరు చెన్నబసప్ప అభిప్రాయపడ్డారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కన్నడ భాషకు ఉన్న ఆదరణను మరింత ఇనుమడింప చేయాలన్నారు. గడినాడు ప్రాంతంలో సోదర భాషతో ఉన్న బాంధవ్యాలను పెంపొందించుకుని కన్నడ భాషకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇతర భాషల వారికి కన్నడను నేర్పాలన్నారు. రాష్ట్రంలో కేవలం 30 శాతం కన్నడ భాష ఉందని విచారం వ్యక్తం చేశారు. తాలూకా కన్నడ సాహిత్య సమ్మేళన అధ్యక్షుడు అయ్యప్పయ్య హుడా, శాంతమల్ల శివాచార్య, కసాప జిల్లాధ్యక్షుడు రంగణ్ణ పాటిల్, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, తాలూకా అధ్యక్షుడు వెంకటేష్ బేవిన బెంచి, సురేష్, రేఖ, ప్రతిభా, రావుత్‌రావ్, తాయప్ప, ఆంజనేయలున్నారు. మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో జాతీయ జెండాను కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహపాత్రో, పరిషత్ జెండాను జిల్లాధ్యక్షుడు రంగణ్ణ పాటిల్, నాడజెండాను వెంకటేష్‌లు అవిష్కరించారు.
కసాప సేవలు అనన్యం
Comments
Please login to add a commentAdd a comment