గుభాళించిన కన్నడ పరిమళం
రాయచూరు రూరల్: రాయచూరులో గురువారం తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ 6వ సమ్మేళనం జరిగింది. దీంతో నగరమంతా కన్నడ జెండాలు వెలిశాయి. వీధులన్ని కన్నడ సంఘాల కార్యకర్తలతో కిటకిటలాడాయి. తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ సమ్మేళనం అధ్యక్షుడు అయ్యప్పయ్య హుడాను మహాత్మాగాంధీ క్రీడా మైదానం నుంచి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరం వరకు ఊరేగించారు. ఊరేగింపులో పలు కళాబృందాలు, కళాకారులు తమ ప్రతిభకు తగ్గట్టుగా ప్రదర్శనలు చేశారు. సమ్మేళనం అధ్యక్షుడిని ఊరేగిస్తున్న సమయంలో కళాకారుడు ఉగ్ర నరసింహ స్వామి వేషధారణ ఆకట్టుకుంది. విద్యార్థులు సుమారు 1500 మీటర్ల పొడవైన కన్నడ జెండాను ప్రదర్శించారు. మహిళలు కుంభ కలశాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.
రాయచూరులో ఘనంగా
తాలూకా కన్నడ సాహిత్య సమ్మేళనం
కార్యకర్తలతో నగర వీధులు కేసరిమయం
గుభాళించిన కన్నడ పరిమళం
Comments
Please login to add a commentAdd a comment