దొడ్డకేశవరెడ్డి ఎన్నికపై హర్షం
బళ్లారి అర్బన్: ప్రాథమిక సహకార గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడిగా కొర్లగుంది వీ.దొడ్డకేశవరెడ్డి మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఆయన సదరు కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన వేళ ప్రముఖులు కేశవరెడ్డిని అభినందించారు. గత నెల 12 మంది డైరెక్టర్ల ఎన్నికల్లో కేశవరెడ్డి వర్గానికి చెందిన ఏడుగురు విజేతలయ్యారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకై క అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దొడ్డ కేశవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన దొడ్డ కేశవరెడ్డి మాట్లాడుతూ బ్యాంక్ ద్వారా రైతులకు లభించే వివిధ సౌకర్యాలు పథకాలను రైతులకు అందించడంలో చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు. రైతుల తమ సమస్యలను తమ దృష్టికి తెస్తే వాటిని శాయశక్తులా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా ఈసందర్భంగా దొడ్డ కేశవరెడ్డిని మాజీ ఎంపీ సన్నపక్కీరప్ప, కార్పొరేటర్ శ్రీనివాస్ మోత్కర్, ప్రముఖ న్యాయవాది బాదామి శివలింగనాయక, ఐహోళె నాగరాజు, జనతా బజార్ అధ్యక్షుడు వేమన్న, డైరెక్టర్ నరేష్‌కుమార్ తదితరులు అభినందించారు. కొళగల్లు హులియప్ప, కొర్లగుంది రాఘవరెడ్డి, జనతాబజార్ డైరెక్టర్ ప్రదీప్‌రెడ్డి, మర్రిస్వామిలతో పాటు కేశవరెడ్డి బంధుమిత్రులు, అభిమానులు విశేషంగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment