నకిలీ మద్యం తయారీ అడ్డాపై దాడి
హుబ్లీ: ఓ తోటలోని ఇంట్లో నకిలీ మద్యం తయారు చేస్తున్న అడ్డాపై బెళగావి విభాగం జాయింట్ కమిషనర్ శాఖాధికారులు దాడి చేసి భారీగా నకిలీ మద్యం, సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. ఘటన గురించి ధార్వాడ జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ రమేష్ కుమార్ మీడియాకు వివరాలు అందించారు. సమీపంలోని చబ్బి వద్ద ఓ తోట ఇంట్లో నకిలీ మద్యం తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి నకిలీ మద్యం, తయారీకి వాడుతున్న వివిధ వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. రూ.5 లక్షల విలువ చేసే నకిలీ మద్యంతో పాటు అక్కడి వస్తువులను జప్తు చేశారు. హుబ్లీకి చెందిన సందీప్, అమృత్‌లను అరెస్టు చేశారు. మరో నిందితుడు వినాయక్ పరారయ్యాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. అతడు దొరికితే ఈ అక్రమ మద్యం గుట్టు రట్టవుతుందని భావిస్తున్నారు. సదరు తోట ఇంటి యజమానికి ఎరువుల అంగడి పెడతామని అద్దెకు తీసుకొన్నారు. ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 24 బాక్స్‌ల నకిలీ మద్యాన్ని పరీక్షల కోసం ధార్వాడ ల్యాబ్‌కు పంపించామన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment