సిద్దూ పద్దుకు వేళాయె
శివాజీనగర: ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం రికార్డు స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతను కల్పిస్తున్నారు. కాంగ్రెస్ ప్రణాళికల ప్రకారం ఐదు గ్యారెంటీ పథకాలను ముందుకు కొనసాగించటంతో పాటు మరిన్ని ప్రజోపయోగ పథకాలను చేర్చనున్నారు. అభివృద్ధి పథకాలకు ఆర్థికస్థితి కొరతపై అధికార పార్టీ ఎమ్మెల్యేల్లోని అసంతృప్తిని చల్లార్చేందుకు సీఎం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు.
గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట
గ్రామీణ రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తుండగా, విద్యా శాఖలో భవనాల నిర్మాణం, తరగతి గదుల సంఖ్య పెంపు, ఉపాధ్యాయ నియామకం, ఆరోగ్య రంగంలో ప్రాఽథమిక సేవల బలోపేతం, జిల్లా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ సదుపాయాల పెంపు, పరిశ్రమలకు పలు ప్రత్యేక రంగాల నిర్మాణంతో పాటు కొత్త పథకాలను ప్రకటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయం గురించి బడ్జెట్‌లో ప్రస్తావించనున్న సీఎం న్యాయసమ్మత పన్ను వాటా కోసం మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. మేకెదాటు, మహదాయి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించనున్నారు.
కళసా బండూరిపై ముందడుగు
మహదాయి నదికి అడ్డంగా కళసా బండూరి వద్ద ఆనకట్ట నిర్మించి ఉత్తర కర్ణాటక భాగంలో తాగునీటిని సరఫరా చేయాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం గోవా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి, పర్యావరణ భద్రత నెపంతో నిరభ్యంతర పత్రం ఇవ్వకుండా ఆలస్యం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం బడ్జెట్‌లో గత ప్రభుత్వాలు కూడా కళసా బండూరి ప్రాజెక్ట్‌ను ప్రస్తావించినా కూడా సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయాత్మకమైన అడుగు వేయటానికి సిద్ధమైంది. పాత మైసూరు భాగంలో మేకెదాటు ప్రాజెక్ట్ చాలా కాలంగా మరుగున పడింది.
కొన్ని కొత్త పథకాలకు అవకాశం
పాడి పరిశ్రమ, వ్యవసాయానికి అనుకూలమైన కొన్ని పథకాల ప్రస్తావన ఉంటుంది. యువనిధికి మరికొందరు పట్టభద్రుల చేరిక, గృహజ్యోతి పథకానికి పూర్తి స్థాయిలో సొమ్ము కల్పించటంతో పాటు అనేక నిర్ణయాలను సిద్దరామయ్య ప్రకటించనున్నారు. గ్రామీణ భాగంలో తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ ఎన్నికలు, బెంగళూరులో మహానగర పాలికెకు ఎన్నికలు జరిపే అవకాశం ఉండటంతో సిద్దరామయ్య ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమయ్యారు.
శాసనసభలో హైలెట్స్
నేడు రికార్డు స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీఎం
గ్యారెంటీలతో పాటు మరిన్ని కొత్త పథకాల జోడింపు?
బనశంకరి: రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ వేధింపుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన బిల్లును గురువారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య తరపున మంత్రి హెచ్‌కే.పాటిల్ ప్రవేశపెట్టారు.
ఎమ్మెల్యేలకు రీక్రియేషన్ కోసం కాఫీ, టీ వ్యవస్ధతో పాటు క్లబ్ వ్యవస్థ చేస్తామని స్పీకర్ యుటీ.ఖాదర్ తెలిపారు.
రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏకరూప పద్ధతిలో ధర నిర్ణయించి అమల్లోకి తెస్తామని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కర్ణాటక పథకం కింద చికిత్స వ్యయం పరిష్కరిస్తే పథకం 90 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు.
మలెనాడు, కరావళి జిల్లాల్లో సమస్యగా మారిన కోతి జ్వరానికి (కేఎఫ్‌డీ) వచ్చే ఏడాదిలోగా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని గురువారం అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు.
తాగునీటికి రూ.10 కోట్లు నిధులు అందిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్‌ఖర్గే తెలిపారు.
కార్వారలో 450 పడకల సామర్థ్యంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామని వైద్యవిద్యా శాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్ ప్రకటించారు.
కొత్త యూనివర్శిటీలను విలీనం చేస్తామని, యూనివర్శిటీలను మూసివేత జరగదని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తెలిపారు.
మెస్కాం టెండర్లలో అక్రమాలు జరిగితే పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇంధన శాఖమంత్రి కేజే.జార్జ్ తెలిపారు.
సిద్దూ పద్దుకు వేళాయె
సిద్దూ పద్దుకు వేళాయె
Comments
Please login to add a commentAdd a comment