పీయూసీ విద్యార్థిని బదులు పరీక్ష రాసిన లా స్టూడెంట్
దొడ్డబళ్లాపురం: పీయూసీ విద్యార్థినికి బదులుగా పరీక్షరాస్తూ న్యాయ విద్యార్థిని పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన కలబుర్గి పట్టణంలోని మిలింద్ కళాశాలలో చోటుచేసుకుంది. ఈనెల 5న పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరిగాయి. కలబుర్గి పట్టణంలోని మిలింద్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అర్చన అనే విద్యార్థిని బదులు సంపూర్ణ పాటిల్ అనే లా చదువుతున్న యువతి పరీక్షలు రాసింది. దళిత సేన కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తించి కళాశాలకు వెళ్లి ప్రశ్నించడంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంపూర్ణ పాటిల్‌ను అరెస్టు చేశారు. ఈమె కాంగ్రెస్ కార్యకర్తగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment