బెంగళూరుకు నిధుల వరద
బెంగళూరులో సిగ్నల్ రహిత రహదారుల అభివృద్ధి
బనశంకరి: సీఎం సిద్దరామయ్య బడ్జెట్‌లో రాజధాని బెంగళూరు నగరానికి దండిగానే నిధులు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి గుండెకాయ లాంటి బెంగళూరులో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రకటించారు. ప్రతి ఏటా నగరానికి అందించే రూ.3 వేల కోట్ల నిధులను ఈ ఏడాది రూ.7 వేల కోట్లకు పెంచారు. ఈ నిధులతో బీబీఎంపీ పరిధిలో అభివృద్ధి పనులు ప్రాధాన్యత ప్రకారం చేపట్టడానికి కొత్తగా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.
● బీబీఎంపీ కి రూ.40 వేల కోట్ల వ్యయంతో ఉత్తర–దక్షిణ, తూర్పు–పశ్చిమ సొరంగ మార్గం కారిడార్లను చేపట్టడానికి అనుకూలమయ్యేలా రూ.19 వేల కోట్ల గ్యారంటీని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
● ట్రాఫిక్ రద్దీ నివారణ, సజావుగా రాకపోకల కోసం నగరంలోని ప్రధాన రోడ్లను సిగ్నల్ రహితం చేసేలా చర్యలు
● నమ్మమెట్రో మూడో దశ–3లో రూ.8,916 కోట్ల వ్యయంతో 40–50 కిలోమీటర్ల మేర మార్గాల నిర్మాణం. రానున్న రెండేళ్లలో మొత్తం 98.60 కిలోమీటర్లు అదనపు మార్గాలను నిర్మించడం లక్ష్యం. మెట్రోను దేవనహళ్లికి విస్తరణ.
● రాజకాలువల మిగులు స్థలాలను ఉపయోగించుకుని రూ.3 వేల కోట్ల వ్యయంతో 300 కిలోమీటర్లు అదనపు రోడ్లను అభివృద్ది చేయడం
● నగరంలో 460 కిలోమీటర్ల ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లను రూ.660 కోట్ల వ్యయంతో అభివృద్ధి
● 120 కిలోమీటర్ల పొడవుతో ఫ్లై ఓవర్, గ్రేడ్ సెపరేటర్‌ల నిర్మాణం. బ్రాండ్ బెంగళూరు పథకాలకు రూ.1,800 కోట్లు. ఆరోగ్య బెంగళూరు కోసం రానున్న మూడేళ్లలో రూ.413 కోట్లతో పథకాలు
● వరద ముంపు తప్పించడానికి భూగర్భ డ్రైనేజీ, ఎస్‌టీపీలను నిర్మించడానికి బీబీఎంపీ, బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ కి రూ.3 వేల కోట్ల ఆర్థిక సాయం
● కావేరి 5 వ స్టేజ్ ద్వారా బెంగళూరు చుట్టుపక్కల 110 గ్రామాల్లో నివసించే 50 లక్షల నివాసులకు జలం అందించడం
● బ్రాండ్ బెంగళూరు –హసిరు బెంగళూరు కింద రూ.35 కోట్ల వ్యయంతో 14 చెరువుల ప్రగతి. రూ 234 కోట్లతో వర్తూరు, బెల్లందూరు చెరువులు పునరుజ్జీవనం.
● ఇక బెంగళూరులో ఆస్తిపన్ను వసూలులో నూతన చర్యల ద్వారా వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఆన్‌లైన్ ద్వారా ఈ–ఖాతా వ్యవస్థకు మంచి స్పందన వస్తోంది. 2024–25లో రూ.4,556 కోట్ల ఆస్తి పన్ను వసూలు. ఏడాదికి రూ.7500 కోట్ల ఆస్తి పన్నును రాబట్టాలని అంచనా వేస్తున్నట్లు సీఎం తెలిపారు.
సొరంగ మార్గం మీద సర్కారు దృష్టి
ఏటా ఇచ్చే నిధులు రూ.7 వేల
కోట్లకు పెంపు
సొరంగ మార్గానికి రూ.19 వేల
కోట్ల గ్యారంటీ
మెట్రో రైలు విస్తరణ పథకాలు
మరిన్ని ప్రాంతాలకు కావేరి జలాలు
బడ్జెట్‌లో కేటాయింపులు
బెంగళూరుకు నిధుల వరద
బెంగళూరుకు నిధుల వరద
Comments
Please login to add a commentAdd a comment