నీటికుంటలో మృత్యుఘోష
చింతామణి: ఓ పొలంలోని నీటి కుంటలో ముగ్గురు యువ రైతులు ప్రాణాలు కోల్పోయారు. కరెంటు వైర్లు తగిలి వీరు మరణించారు. ఎలా జరిగిందనేది మిస్టరీగా ఉంది. ఈ దారుణం చింతామణి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ముంతకదిరేనహళ్లి గ్రామ శివార్లలో శుక్రవారం జరిగింది. మృతులు ముత్తకదిరేనహళ్లికి చెందిన లోకేష్ (32), రమేష్ (28) శ్రీకాంత్ (26). వివరాలు.. లోకేష్ ఇతరుల పొలాన్ని గుత్తకు తీసుకొని వ్యవసాయం చేసుకొనేవాడు. పంటల కోసం సంపు తవ్వుకుని నీటిని నింపాడు. పక్కన కరెంటు బాక్స్, మోటారు ఉన్నాయి. ఆ నీటిలోకి లోకేష్ దిగినప్పుడు వైర్లు తగలడంతో షాక్‌తో అక్కడే మరణించాడు.
అదే మాదిరిగా ఇద్దరు...
ఏం జరిగిందోనని పక్క తోటలో పని చేస్తున్న రమే ష్, శ్రీకాంత్‌లు వచ్చి చూడగా వారికి కూడా షాక్ కొట్టి నీటి కుంటలో పడిపోయారు. సాయంత్రమైనా ఇళ్లకు రాకపోవడంతో వారి కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి కుంటలో వెతకడంతో ముగ్గురి శవాలు బయటపడ్డాయి. కుటుంబ సభ్యలు రోదనలు ఆకాశానికంటాయి. డీఎస్పీ మురళీదర్, సీఐ శివకుమార తదితరులు పరిశీలించారు. జరిగిన ఘటనను చూసినవారెవరూ లేకపోవడంతో, ప్రమాదం జరిగిన తీరుపై అనేక సందేహాలు వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కరెంటు వైర్లు తగిలి ముగ్గురు
యువ రైతుల మృతి
మిస్టరీగా సంఘటన
నీటికుంటలో మృత్యుఘోష
Comments
Please login to add a commentAdd a comment