● వ్యవసాయానికి స్వల్పం
బనశంకరి: 2025– 26వ బడ్జెట్ సైజు రూ.4,09,549 కోట్లు. గత ఏడాది బడ్జెట్ రూ.3,71,383 కోట్లుగా ఉండింది. ప్రతి ఏటా బడ్జెట్ పరిమాణం పెరుగుతూ వస్తోంది. యథా ప్రకారం విద్యాశాఖకు అధిక కేటాయింపులు జరిగాయి. రైతాంగాన్ని నిరుత్సాహ పరుస్తూ తక్కువ కేటాయింపులు చేయడం గమనార్హం. రైతుల కోసం గణనీయమైన పథకాలను ఏవీ ప్రకటించలేదు.
వివిధ శాఖలకు కేటాయించిన నిధులు (రూ.కోట్లలో)
● విద్యా శాఖ రూ.45,286
● మహిళ, శిశు సంక్షేమ శాఖ రూ.34,955
● విద్యుత్ రూ.26,896
● గ్రామీణాభివృద్ధి శాఖ రూ.26,735
● నీరావరి నీటిపారుదల శాఖ రూ.22181
● నగరాభివృద్ధి, వసతి శాఖ రూ.21,405
● పరిపాలన, రవాణా శాఖ రూ.20,625
● ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రూ.17,473
● రెవెన్యూ శాఖ రూ.17,201
● సాంఘిక సంక్షేమ శాఖ రూ.16,955
● ప్రజాపనుల శాఖ రూ.11,841
● ఆహారశాఖ రూ.8,275
● వ్యవసాయ ఉద్యానవనశాఖ రూ.7,145
● పశు సంవర్ధక, మత్య్సశాఖ రూ.3,977
● ఇతరత్రా.. రూ.1,49,857
Comments
Please login to add a commentAdd a comment