విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నుల పంపిణీ
బళ్లారి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రత్యేక గుణాలు సంతరించుకొంటారని జోళదరాశి జేటీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సంఘ సేవకులు తిమ్మప్ప జోళదరాశి తెలిపారు. కోట ఆజాద్ ప్రభుత్వ హైస్కూల్, శ్రీరాంపుర హైస్కూల్, మున్సిపల్ ప్రభుత్వ హైస్కూల్, తాలూకాలోని హలకుంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా పరీక్ష ప్యాడ్లతో పాటు పెన్నులను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తగినంత ప్రోత్సాహం అందిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ప్రశంసించారు. విద్యార్థులకు శాయశక్తుల తన సహాయ సహకారాలను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ విలేకరి మంజునాథ్, టీపీ ఈఓ మడిగిన బసప్ప, విశ్రాంత హెచ్‌ఎం గురురుద్రప్ప, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఆనంద్‌నాయక్, కెంచప్ప, ఉపాధ్యాయిని డాక్టర్ సిద్దేశ్వరి, ప్రముఖులు రూపనగుడి గోవింద, జనార్థన్ నాయక, దుర్గప్ప, సత్యనారాయణ, కొక్కరచేడు తిమ్మప్ప, కాయిపల్లె బసవరాజు, రూపనగుడి వెంకటేష్, నాగరాజ్, ప్రెస్ ఫోటోగ్రాఫర్ రుద్రమునిస్వామి, జోళదరాశి తిక్కన్న, చంద్రశేఖర్, మనోజ్, వినోద్, శెక్షావలి, కౌశిక్, శైలేంద్ర, సాయిబన్ని, సుధాకర్ హెగ్డె తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment