రేపు ధార్వాడలో భారీ ఉద్యోగ మేళా
హుబ్లీ: ప్రభుత్వ సూచనల మేరకు ఆదివారం ధార్వాడ కేసీడీ ఆవరణలో కౌసల్య రోజ్‌గార్ ఉద్యోగ మేళాను ఏర్పాటు చేశారు. ఈవిషయంలో వివిధ సన్నాహాలను జిల్లాధికారిణి దివ్యప్రభు శుక్రవారం స్వయంగా ఆ ఆవరణకు వెళ్లి పరిశీలించారు. కాగా గత నెల 25 నుంచి నిరుద్యోగుల నుంచి నమోదు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభమైంది. ఈనెల 7 వరకు కొనసాగింది. అంతేగాక ఆదివారం రోజు కూడా నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకొనే అవకాశం ఉందన్నారు. 65 పరిశ్రమలు, 25 మానవ వనరుల సంస్థల ప్రతినిధులు ఈ మేళాలో తమకు కావాల్సిన ఉద్యోగార్థులను నియామకం చేసుకొంటారు. ఇందుకు సంబంధించి వచ్చే వారందరికీ అన్ని ఏర్పాట్లను కేసీడీ పర్యాటక విభాగం, డాక్టర్ గోకాక్ గ్రంథాలయ భవనంలో ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు చేశారు. వంద మంది స్వచ్ఛంద కార్యకర్తలను నియమించారు. తాగునీరు, మరుగుదొడ్లు, వెయిటింగ్ రూంలను ఏర్పాటు చేశారు. ప్రక్రియ అంతా క్రమశిక్షణతో జరిగేలా అసిస్టెంట్ కమిషనర్‌ను నోడల్ అధికారిగా నియమించారు. జెడ్పీ సీఈఓ భువనేష్ పాటిల్ మాట్లాడుతూ మేళాలో సంస్థ సమాచారం తెలియజేస్తూ మైకుల ద్వారా ఆ రోజున ప్రచారం చేస్తామన్నారు. పోలీసు కమిషనర్ శశికుమార్ మేళాకు అవసరమైన భద్రత చర్యలు తీసుకొన్నారు.
కార్మికుల సమస్యలు
పరిష్కరించరూ..
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌్ చేశారు. శుక్రవారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయంలో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం అధ్యక్షుడు ఫకృద్దీన్ మాట్లాడారు. కార్మికులకు వైద్య పరీక్షలు చేపట్టాలని, 2020–21లో పీఎల్‌బీ పరిహరం అందించాలన్నారు. 2023లో కార్మికులకు పదోన్నతి కల్పించాలన్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులను పర్మినెంట్ చేయాలని కోరారు. ఆందోళనలో వెంకటేష్, షఫీ, అల్లాభక్షి, శ్రీధర్‌లున్నారు.
అశ్లీల ఫోటోల అప్‌లోడ్‌పై ఫిర్యాదు
హుబ్లీ: సోషల్ మీడియాలో అశ్లీల ఫోటోలను అప్‌లోడ్ చేసిన ఆరోపణలపై ఓ వ్యక్తికి వ్యతిరేకంగా కేసు దాఖలైంది. పాత హుబ్లీకి చెందిన మహమ్మద్ సాదిక్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకొన్నారు.
హెల్మెట్ ధారణ..
ప్రాణాలకు రక్షణ
రాయచూరు రూరల్: ద్విచక్ర వాహనంలో సంచరించే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని సిటీ కార్పొరేషన్ కమిషనర్ గురుసిద్దయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద హెల్మెట్ వాడకంపై జాగృతి జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదాల బారి నుంచి రక్షణకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వివిధ శాఖల ఉద్యోగులు, ిసిబ్బంది జాగృతి కల్గించారు.
9న భారీ రక్తదాన శిబిరం
హుబ్లీ: హుబ్లీ–ధార్వాడ సమస్త బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో రాష్ట్రోత్థాన బ్లడ్‌బ్యాంక్ సహకారంతో ఆదివారం భవానీనగర్ రాఘవేంద్ర స్వామి మఠంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు డాక్టర్ పవన్ జోషి తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉదయ 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రక్తదాన శిబిరం ఉంటుందన్నారు. ఈసారి రాఘవేంద్రస్వాముల 430వ వర్థంతి ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఈసారి ఎక్కువ సంఖ్యలో దాతలు రక్తాన్ని దానం చేయవచ్చన్నారు. అనంతరం రక్తపరీక్ష శిబిరం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈసందర్భంగా దత్తమూర్తి కులకర్ణి, కిరణ్ హెగ్డె, లక్ష్మణ్ కులకర్ణి పాల్గొన్నారు.
రేపు ధార్వాడలో భారీ ఉద్యోగ మేళా
Comments
Please login to add a commentAdd a comment