మాజీ మంత్రి కారు డ్రైవర్ అరెస్టు
దొడ్డబళ్లాపురం: జువెలరీ షాప్‌ల యజమానులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి భారీగా నగలు, డబ్బు వసూలు చేసి మోసం చేసిన కిలేడీ ఐశ్వర్యగౌడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి వినయ్ కులకర్ణి కారు డ్రైవర్ వీరేశ్ దళవాయిని అరెస్టు చేశారు. ఐశ్వర్యగౌడకు చెందిన బెంజ్ కారు వినయ్ కులకర్ణి ఇంటి ముందు లభించింది. దీంతో డ్రైవర్‌ను పోలీసులు విచారణ నిమిత్తం అరెస్టు చేశారు. వినయ్ కులక ర్ణితో ఐశ్వర్యగౌడకు పరిచయం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల పోలీసులు గాలిస్తున్నప్పుడు ఆమె మహారాష్ట్రకు వెళ్లే ముందు ధార్వాడలోని వినయ్ కులకర్ణి ఇంటికి వచ్చింది. వెళ్లేటప్పుడు తన కారు అక్కడే వదిలి విమానంలో మహారాష్ట్రకు వెళ్లింది. కేసు కొలిక్కి వచ్చిందని త్వరలో చార్జ్‌షీట్ సమర్పిస్తామని పోలీసులు తెలిపారు.
వీర వనితలే ఆదర్శం
తుమకూరు: మహిళల సమస్యల పైన నిరంతరం పోరాడే మహిళలను గుర్తించి సన్మానించాలని సీనియర్ న్యాయవాది మరిచెన్నమ్మ అన్నారు. జిల్లా మహిళా న్యాయవాదులు ఆదివారం ఇక్కడ వనితా దినోత్సవాన్ని నిర్వహించారు. అనేకమంది మహిళలు అణచివేతకు గురవుతున్నారని, అలాంటివారికి మద్దతుగా పోరాటం చేయాలని అన్నారు. కిత్తూరు రాణి చెన్నమ్మ, అక్క మహాదేవి, సావిత్రిబాయి పూలె వంటివారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
శిథిలాల కింద సమాధి
● భవనం కూలి నలుగురు
వీధి వ్యాపారుల మృతి
● బేలూరులో దుర్ఘటన
యశవంతపుర: హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో విషాద సంఘటన జరిగింది. శిథిలమైన కట్టడం కూలిపోయి ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. మృతులు ఆశా, దీపు, మరో ఇద్దరి వివరాలు తెలియవలసి ఉంది. పట్టణంలోని నడిబోడ్డున ఉన్న పాత కట్టడంలో వీధి వ్యాపారం చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆ కట్టడం హఠాత్తుగా కూలిపోయింది. నలుగురూ శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు వదిలారు. స్థానికులు, పోలీసులు జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు.
మాజీ మంత్రి కారు డ్రైవర్ అరెస్టు
మాజీ మంత్రి కారు డ్రైవర్ అరెస్టు
మాజీ మంత్రి కారు డ్రైవర్ అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment