రన్ పోలీస్.. రన్
బనశంకరి: కర్ణాటక రాష్ట్ర పోలీస్ మారథాన్ ఆదివారం రాష్ట్రమంతటా ఉత్సాహంగా సాగింది. జిల్లా కేంద్రాల్లో పోలీసులు, ప్రజలు పరుగులో పాల్గొన్నారు. విధానసౌధ ముందు హోంశాఖమంత్రి పరమేశ్వర్ పరుగును ప్రారంభించారు. డ్రగ్స్ రహిత కర్ణాటక, సైబర్ నేరాల కట్టడి, ఆరోగ్య పరిరక్షణ, హసిరు బెంగళూరు అనే నినాదంతో మారథాన్‌ను నిర్వహించారు . 10 కి.మీ., 5 కి.మీ. విభాగాల్లో పోలీస్ అధికారులు సిబ్బంది, ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. విదానసౌధ నుంచి మొదలై కేఆర్.సర్కిల్, నృపతుంగరోడ్డు, కస్తూరిబారోడ్డు తదితర మార్గాల గుండా మళ్లీ సౌధకు చేరింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ అలోక్‌మోహన్, పోలీస్ కమిషనర్ బీ.దయానంద్, ఐపీఎస్‌లు పాల్గొన్నారు.
శివమొగ్గ, మైసూరులో
శివమొగ్గ: శివమొగ్గ నగరంలో వేలాదిగా మారథాన్‌లో పాల్పంచుకున్నారు. నమ్మ పోలీసు, నమ్మ హెమ్మె అనే నినాదంతో సాగింది. పోలీస్ మైదానంలో ప్రతిజ్ఞ ఆచరించారు. ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మైసూరులో వేలాది మంది పరుగులో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఉత్సాహంగా మారథాన్
Comments
Please login to add a commentAdd a comment