న్యూ శ్రీ చైతన్య రాధాకృష్ణ కళాశాల అధినేతకు మాతృవియోగం
సాక్షి,బళ్లారి: బళ్లారిలోని న్యూ శ్రీ చైతన్య రాధాకృష్ణ పీయూ కళాశాల అధినేత పయ్యావుల రాధాకృష్ణ మాతృమూర్తి పయ్యావుల జానకమ్మ (88) మృతి చెందారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జానకమ్మ స్వగ్రామం ఏపీలోని రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్. ఆమె కుమారుడు రాధాకృష్ణ బళ్లారిలో ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. న్యూ శ్రీ చైతన్య కళాశాల ఏర్పాటు చేసి బళ్లారిలోని ఉంటున్నారు. జానకమ్మకు సోమవారం బళ్లారిలోని హరిశ్చంద్ర ఘాట్‌లోఅంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుమారుడు రాధాకృష్ణ తెలిపారు. జానకమ్మ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
19 రోజుల్లో రూ.46 లక్షల కానుకలు
హుబ్లీ: శ్రీ సిద్దరూఢ స్వామి మఠం హుండీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ సిద్దరూఢ బ్యాంక్ మేనేజర్ సిబ్బంది భక్తుల సమక్షంలో ఈ నెల 5న లెక్కించారు. 19 రోజుల వ్యవధిలో భక్తులనుంచి రూ.46,73,931 కానుకలు లభించినట్లు అధికారులు తెలిపారు. కమిటీ చైర్మన్ బసవరాజ కళ్యాణశెట్టర్, వైస్ చైర్మన్ మంజునాథ మునవళ్లి, గౌరవ కార్యదర్శి సార్వమంగళ పాటక, ధర్మకర్త బాలు టి భగజికొండి, వసంత వై సాలగట్టి గీతా టీ.కలబుర్గి వినాయక ఘోర్ఖె, చెన్నవీర ఢీ ముంగురవాడి, సావిత్రి మడివాళర పాల్గొన్నారు.
ఈత కొలను పునః ప్రారంభం
హుబ్లీ: సాంకేతిక కారణాలతో మూడు, నాలుగు వారాల నుంచి మూసి వేసిన పాలికె ఆధ్వర్యంలోని ఈత కొలను ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. దీంతో ఈత ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. స్మార్ట్ యోజన ద్వారా రూ.3.50 కోట్లతో నిర్మించిన ఈత కొలనుకు జనాదరణ లేక ఆదాయం రాని కారణాలతో బంద్ చేశారు. ప్రస్తుతం ఎండకాలం కావడంతో స్మిమింగ్ పూల్ బంద్ చేయడంపై స్థానికుల నుంచి తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈత కొలనును తిరిగి ప్రారంభించినట్లు పాలికె కమిషనర్ రుద్రేస్ గాలి తెలిపారు.
వివాహిత అనుమానాస్పద మృతి
రాయచూరురూరల్: జిల్లా కేంద్రంలోని వాసవీ నగర్‌లో నివాసముంటున్న ప్రపన్న లక్ష్మి అనే వివాహిత శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ నేర పరిశోధన ఎస్‌ఐ లక్ష్మి తెలిపిన మేరకు... ప్రసన్న లక్ష్మి భర్త జంబన గౌడ మద్యం మత్తులో హింసలు పెట్టేవాడు. దీంతో ఏడాదిగా ఆమె మానసిక క్షోభకు గురవుతోంది. ఈక్రమంలో వారం రోజలు క్రితం భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతరాత్రి ప్రసన్న లక్ష్మి విగతజీవిగా మారింది. ఆత్మహత్య చేసుకుందా? హత్యకు గురైందా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు.
సెల్‌ఫోన్లు కాదు.. సృజనకు చోటివ్వండి
హొసపేటె: చిన్నారులకు సెల్‌ఫోన్లు ఇవ్వకుండా ఆడుకునేందుకు బొమ్మలు ఇవ్వాలని, తద్వారా వారిలో సృజనాత్మకత పెరుగుతుందని ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కేవీ ప్రభాకర్ అన్నారు. బాలభవన్‌లో ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. బిడ్డకు తినిపించేటప్పుడు కూడా తల్లి మొబైల్ ఫోన్‌లో చూపిస్తుందని, కాబట్టి పిల్లలు పెరిగి పెద్దవారై మొబైల్ ఫోన్‌కి అతుక్కుపోతారన్నారు. ఇది ఆరోగ్యకరమైన పరిణామం కాదన్నారు. పిల్లలు స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకున్నప్పుడు వారిలో సృజనాత్మకత వృద్ధి చెందుతుందన్నారు. పిల్లలు మొదటి సృజనాత్మక చర్య వారి స్వంత బొమ్మలను సృష్టించడంలో ప్రారంభం అవుతుందన్నారు.
డబ్బు, మద్యం లేని
రాజకీయాలు రావాలి
కోలారు: డబ్బు, మద్యం లేని రాజకీయాలు రావాల్సి ఉందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిమా జె.పాటిల్ అన్నారు. తాలూకాలోని కల్లండూరు గ్రామంలో డాక్టర్ నాగరాజ్ నివాసంలో డాక్టర్ నాగరాజ్ గెళెయర బళగను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల్లో నిష్పాక్షిత ఉంటేనే ఉత్తమ పాలన లభిస్తుందన్నారు. ఆ దిశగా ప్రజలు ఉత్తమ వ్యక్తులను ఎన్నుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా సమస్యలను నేటికి ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. వ్వవసాయం పూర్తిగా సేంద్రీయం కావాల్సి ఉందన్నారు. వచ్చే ఆగ్నేయ పదవీధర క్షేత్ర విధాన పరిషత్ ఎన్నికల్లో జేడీయు నుంచి డాక్టర్ నాగరాజ్ బరిలో ఉంటారని, ఆయన విజయానికి కృషి చేయాలన్నారు. కల్లండూరు డాక్టర్ కె నాగరాజ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, బీజేపీ ఉపాధ్యక్షుడు తబల నారాయణప్ప పాల్గొన్నారు.
న్యూ శ్రీ చైతన్య రాధాకృష్ణ కళాశాల అధినేతకు మాతృవియోగం
న్యూ శ్రీ చైతన్య రాధాకృష్ణ కళాశాల అధినేతకు మాతృవియోగం
న్యూ శ్రీ చైతన్య రాధాకృష్ణ కళాశాల అధినేతకు మాతృవియోగం
Comments
Please login to add a commentAdd a comment