మహిళలు ఆరోగ్యాలను కాపాడుకోవాలి
రాయచూరురూరల్: మహిళలు అరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాని అర్‌సీహెచ్ అధికారిణి నందిత సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన జాతాను ఆదివారం నగరంలోని ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద ఆమె ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష చూపరాదన్నారు. పురుషులతో సమానంగా ఆడ పిల్లలను చదివించాలన్నారు. వైద్యులు యశోధ, లక్ష్మి, సరోజ, సంధ్య, అంజు పాల్గొన్నారు.
పచ్చదనం పెంపొందించాలి
రాయచూరు రూరల్: పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని అటవీ శాఖ అధికారి రాజేష నాయక్ పిలుపునిచ్చారు. రాయూరులోని కృష్ణగిరి కాలనీలో పక్షులకు నీరు పెట్టడం, మెక్కలు నాటడం తదితర కార్యక్రమాలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
నగరంలో వేసవిలో ఎండలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇళ్ల వద్ద మొక్కలు పెంచుకుంటే చల్లదనాన్ని ఆస్వాదించవచ్చన్నారు. ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిషేధించాలన్నారు. రేఖ, హనుమంతాయ, అనితా హిరేమని, సరస్వతీ పాల్గొన్నారు.
వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయం
రాయచూరు రూరల్: నర్సింగ్ విద్యకు కేంద్ర బడ్జెట్‌లో రూ.3520 కోట్ల నిధులు మంజూరు చేశారని భారతీయ నర్సింగ్ మండలి అధ్యక్షుడు టి. దీలిప్ అన్నారు. నవోదయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నర్సింగ్, ఫిజియోథెరపీ, పార్మసీ, బీఈడీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించి మాట్లాడారు. కోవిడ్ సమయంలో నర్సులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు సేవలు అందించారన్నారు. పట్టాలు అందుకున్న నర్సులు రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కళాశాల ట్రస్టీ యస్.రాజేంద్ర రెడ్డి, రిజిస్ట్రార్ శ్రీనివాస్, డీన్ దేవానంద, గిరిస్, దొడ్డయ్య, అరుణ్, విజయ్‌కుమార్, ఉమాకాంత్, కాజల్ శెట్టి పాల్గొన్నారు.
11న కర్ణాటక కేంద్రీయ వర్సిటీ స్నాతకోత్సవం
రాయచూరు రూరల్: కర్ణాటక కేంద్రీయ విశ్వ విద్యాలయ స్నాతకోత్సవాన్ని ఈనెల 11న నిర్వహిస్త్నట్లు వైస్ చాన్సలర్ బుట్టు సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా 36 మందికి బంగారు పతకాలు, 824 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తామని తెలిపారు. 2009లో ప్రారంభమైన వర్సిటీలో ఇప్పటివరకు 2800 మంది విద్యార్థులు విద్యను అభ్యసించారన్నారు. 175 మంది అధ్యాపకులు ఉన్నారన్నారు. వర్సిటీలో పరిసరాల పరిరక్షణకు రూ.1.21 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. సెమీ కండక్టర్ కోర్సులకు రూ.45 కోట్లతో పరికరాలు కోనుగోలు చేస్తామన్నారు. సమావేశంలో డాక్టర్ కోటా సాయి క్రిష్ణ, అర్.అర్.బిరదార్, రాజీవ్ జోషి, గణపతి, ప్రకాష్ పాల్గొన్నారు.
ఆస్తి పన్ను బకాయిలు
చెల్లించండి
రాయచూరు రూరల్: ఆస్తి పన్ను బకాయిలు మూడు నెలల్లో చెల్లించాలని నగరసభ రెవెన్యూ అధికారి నరసింహారెడ్డి నగరవాసులకు సూచించారు. కోదండ రామాలయం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరితగతిన ఇంటి, నీటి పన్నులు చెల్లించాలన్నారు. అక్రమ కట్టడాలపై పూర్తిస్థాయి విచారణ చేస్తామని తెలిపారు.
మహిళలు ఆరోగ్యాలను కాపాడుకోవాలి
మహిళలు ఆరోగ్యాలను కాపాడుకోవాలి
మహిళలు ఆరోగ్యాలను కాపాడుకోవాలి
మహిళలు ఆరోగ్యాలను కాపాడుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment