డ్రగ్స్ రహిత జిల్లా కోసం చేతులు కలపండి
సాక్షి,బళ్లారి: డ్రగ్స్ రహిత రాష్ట్రం, జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటునందించాలని జిల్లా పోలీసు అధికారులు పిలుపునిచ్చారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీస్ రన్– 2025 కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శోభారాణి ఆదివారం నగరంలోని శ్రీకనక దుర్గమ్మ ఆలయం వద్ద ప్రారంభించారు. అంతకు ముందు పోలీసులకు, నగరవాసులకు యోగాపై అవగాహన కల్పించారు. అనంతరం పోలీసులు, విద్యార్థులు, నగర ప్రముఖులు ర్యాలీగా. రాయల్ సర్కిల్, మోతీ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఎస్పీ సర్కిల్, తాళూరు రోడ్డు వరకు వెళ్లి తిరిగి శ్రీకనక దుర్గమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఆరోగ్యం మన చేతుల్లో ఉందని, ప్రతి రోజు ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి పౌరుడు సహకారం అందించాలన్నారు. ఐజీపీ లోకేష్ కుమార్,ఏఎస్‌పీ రవికుమార్, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
రాయచూరురూరల్: యువకులు దురలవాట్లకు లోను కావద్దని కలెక్టర్ నీతీస్ పిలుపునిచ్చారు. ఫిట్‌నెస్ ఫర్ ఆల్ పేరుతో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన 5కే రన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత మద్యం, మత్తు పదార్థాలకు బానిసై చెడు మార్గంలో పయనిస్తున్నారన్నారు. మంచి అలవాట్లను అలవర్చుకొని వ్యాయామం, యోగా చేస్తూ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. ఎస్పీ పుట్టమాదయ్య, అసిస్టెంట్ కమిషనర్ గజానన, అడిషనల్ ఎస్పీ హరీష్, ఆరోగ్యశాఖ అధికారి సురేంద్రబాబు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, వీరేష్, నాయక్, యంకప్ప, పోలీసు అధికారులు ఉమేష్ కాంబ్లే, దత్తాత్రేయ, సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. మహాత్మా క్రీడా మైదానం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు మారథన్ కొనసాగింది. నగరవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
డ్రగ్స్ రహిత జిల్లా కోసం చేతులు కలపండి
Comments
Please login to add a commentAdd a comment