బహుముఖ ప్రజ్ఞతో మహిళల రాణింపు
బళ్లారిఅర్బన్: మహిళలు బహుముఖ ప్రజ్ఞతో అన్ని చోట్ల తమదైన ప్రతిభ చాటుకున్నారని జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కేజీ శాంతి అన్నారు. స్థానిక ఓ ప్రైవేట్ హోటల్‌లో శ్రీ మాతృ మహిళ మండలి సంఘంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని జడ్జి ప్రారంభించి మాట్లాడారు. భూమి నుంచి ఆకాశం వరకు అన్ని రంగాలలో మగవారి కన్నా తాము ఏమీ తక్కువ కాదంటూ మహిళలు నిరూపిస్తున్నారన్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే తాము ఎ ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారన్నారు. జైలు సూపరింటెండెంట్ లతా మాట్లాడుతూ మహిళ లేని ఇల్లు అసంపూర్తిగా ఉంటుందన్నారు. ఓ కుటుంబం మహిళలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. జిల్లా న్యాయసేవ ప్రాధికార న్యాయమూర్తి రాజేష్ హొసమని మాట్లాడుతూ మహిళలు తమకు అప్పగించిన పని పూర్తి అయ్యేదాక విరామం తీసుకోరని అన్నారు. సీ్త్ర మాతృ మహిళ సంఘం ఆధ్వర్యంలో వివిధ రంగాలలో సేవలు అందించిన సాధకులను ఘనంగా సన్మానించారు. . చివరిగా కీర్తి రెడ్డి సంగీత గాయనం, విశేషంగా విణుల విందు చేసింది. ఆ సంఘం అధ్యక్షురాలు పుష్పలతా చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment