నేడు కనకదుర్గమ్మ సిడిబండి రథోత్సవం
బళ్లారి అర్బన్ : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కీర్తి పొందిన, నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ సిడిబండి రథోత్సవం మంగళవారం నిర్వహించేందుకు కనకదుర్గమ్మ ఆలయ కమిటీ, కౌల్‌బజార్ గాణిగ సమాజం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగర ప్రజలకు శాంతి, ఆరోగ్యం కోసం ఏటా ఈ సిడిబండి ఉత్సవాలను కౌల్‌బజార్ గాణిగర సమాజ బాంధవులు ఆచరిస్తున్నారు. పురాతన కాలంలో బళ్లారిలో కలరా వ్యాధి వ్యాపించడంతో అమ్మవారు ఒకరికి కలలో వచ్చి సిడిబండికి దిష్టి బొమ్మను కట్టి ఆలయం చుట్టు ప్రదక్షణలు చేయమని చెప్పిందని సమాచారం. అప్పట్లో సిడిబండికి ఎద్దులను కట్టి ఒక మనిషిని కాడుమానికి వేలాడ కట్టి అమ్మవారి ఆలయం చుట్టు మూడు ప్రదక్షణలు చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు నగర ప్రజలు ఆరోగ్యంగా, శాంతియుతంగా ఉండేందుకు ఈ సిడిబండి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గాణిగర సమాజ ప్రముఖులు రవికుమార్, రమేష్‌బాబు తెలిపారు. మొదట్లో మనిషిని సిడిబండికి కట్టి ఊరేగించేవారు. అయితే ఆ మనిషి చనిపోయిన తర్వాత అతని రూపంలో ఒక దిష్టిబొమ్మను తయారు చేసి సిడిబండి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యుద్ధవీరుడి దిష్టిబొమ్మతో
మూడు ప్రదక్షణలు
అప్పటి నుంచి యుద్ధవీరుడి దిష్టిబొమ్మను తామే స్వయంగా తయారు చేసి సిడిబండికి కట్టి అమ్మవారి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిపారు. 1974లో ప్రభుత్వ దేవదాయ శాఖకు ఆలయ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ఆలయ పూజారులుగా యాదవ్ బాంధవులకు వంశపారంపర్యంగా బాధ్యతలు అప్పగించి అమ్మవారికి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. సిడిబండికి ఒక రోజు ముందు కౌల్‌బజార్ సజ్జన గాణిగర సమాజ బాంధవులు సిడిబండికి పులిబోనును కట్టి కౌల్‌బజార్ నుంచి మోతీ బ్రిడ్జి, మేదార వీధి, ఎస్పీ సర్కిల్ మీదుగా దుర్గమ్మ గుడి వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సిడిబండి రోజున మధ్యాహ్నం యుద్ధ వీరుడి దిష్టిబొమ్మను ఆలయంలో పూజ చేసి సిడిబండికి కడుతున్నట్లు తెలిపారు. ఈ సిడిబండి రథోత్సవానికి బళ్లారి గాణిగర వంశపారంపర్యంగా దోణప్ప వీధిలోని రెండు ఎద్దులు, బళ్లారి గాణిగర సంఘం రెండు ఎద్దులు, సిరుగుప్ప గాణిగర సమాజం రెండు ఎద్దులను సిడిబండికి కట్టి ఊరేగింపుగా అమ్మవారి ఆలయం చుట్టు మూడు ప్రదక్షణలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా అమ్మవారి భక్తుల సమక్షంలో కనకదుర్గమ్మ ఆలయం చుట్టు సిడిబండి రథోత్సవం నిర్వహించడంతో బళ్లారి ప్రజలు, భక్తులు ఆరోగ్యంగా, శాంతియుతంగా ఉంటున్నారని భక్తుల విశ్వాసం.
ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు
పురాతన కాలంలో వెలసిన కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి ఆలయ వంశపారంపర్య పూజారులు కృషి చేస్తున్నట్లు ఆలయ ప్రధాన ధర్మకర్త పీ.గాదెప్ప తెలిపారు. మొదట్లో అమ్మవారి రూపానికి మాత్రం పూజలు జరిగాయి. భక్తుల సహాయంతో వెండి ఆభరణాల అలంకరణలతో ప్రస్తుతం బంగారు ఆభరణాలతో పూజలు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయం ముందు దుర్గాదేవి ఎత్తైన విగ్రహం, నరకాసుర విగ్రహాలను కూడా ప్రతిష్టించి పూజలు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటక శాఖ నుంచి రూ.14 కోట్లు మంజూరయ్యాయి. అందులో రూ.7.70 కోట్లు మొదట విడుదల చేయగా, 4 గోపురాలు, ప్రహరీగోడ, మండపాల పనులు పూర్తి అయ్యాయని దేవదాయ శాఖ అధికారి ఈఓ హనుమంతప్ప తెలిపారు. ప్రాంగణంలో రూ.90 లక్షలతో పుష్కరణి, ఆలయ హుండీలో రూ.90 లక్షలతో మరిన్ని పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.50 కోట్లతో ఆలయ ముందు అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సిడిబండి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ నెల 11న మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు నగర ప్రజల ఆరాధ్య దైవం కనకదుర్గమ్మ సిడిబండి రథోత్సవాన్ని అమ్మవారి ఆలయం చుట్టు మూడు ప్రదక్షణలు, జోడి ఎద్దులతో సిడిబండి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు.
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు
ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం
అన్ని ఏర్పాట్లు పూర్తి
నేడు కనకదుర్గమ్మ సిడిబండి రథోత్సవం
నేడు కనకదుర్గమ్మ సిడిబండి రథోత్సవం
నేడు కనకదుర్గమ్మ సిడిబండి రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment