వీధి కుక్కలకు టీకాలు
కోలారు : నగరంలో వీధి కుక్కల నియంత్రణకు నగరసభ ముందుకు వచ్చింది. పశు సంవర్ధక శాఖ సహకారంతో నగరంలోని వీధి కుక్కలకు టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై వివరణ ఇచ్చిన నగరసభ కమిషనర్ ప్రసాద్ పశు సంవర్ధక శాఖ సహకారంతో వీధి కుక్కలకు టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. నగరం విస్తరిస్తున్న కొద్ది వీధి కుక్కల సంతతి కూడా పెరుగుతోంది. వీధి కుక్కలతో నగర ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటుండడాన్ని గుర్తించి వీధి కుక్కల బెడద నియంత్రణకు పూనుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. టీకా వేసిన కుక్కకు గుర్తు పెడుతున్నామన్నారు. నగరంలోని ప్రతి వార్డులోను కుక్కలకు టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. టీకాలు వేయడం వల్ల కుక్క కరిచినా ఎలాంటి ప్రాణాపాయం ఉండబోదన్నారు. ఇప్పటికే 165 కుక్కలకు టీకాలు వేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment