రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టరూ
రాయచూరు రూరల్: నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టాలని కర్ణాటక దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద అధ్యక్షుడు తిప్పేస్వామి మాట్లాడారు. నగరంలోని ఆశాపూర్ రోడ్డు ఇరుకుగా ఉన్నందున వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. నగరసభ అధికారులు చర్యలు చేపట్టి ఆక్రమణలను తొలగించి, రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
రేపు రేణుకాచార్య జయంతి
రాయచూరు రూరల్ : నగరంలో రేణుకాచార్య జయంతి, యుగ మానోత్సవాలు ఈ నెల 12న నిర్వహిస్తున్నట్లు జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షుడు శరణ భూపాల్ నాడగౌడ వెల్లడించారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని మంగళవారపేట మఠం నుండి 8 గంటలకు రేణుకాచార్య సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం వీరశైవ కళ్యాణ మంటపంలో జిల్లాధికార యంత్రాగం, జిల్లా పంచాయతీ, నగరసభ, .సాంఘీక సంక్షేమ శాఖ, వీరశైవ సమాజం ఆధ్వర్యంలో రేణుకాచార్య జయంతి, యుగ మానోత్సవాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారన్నారు. విలేకరుల సమావేశంలో శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, వీర సంగన బసవ శివాచార్య, చంద్రశేఖర్, వీరయ్య స్వామి, శరణు సురగి మఠలున్నారు.
కానిస్టేబుల్‌పై
ఇసుక మాఫియా దాడి
రాయచూరు రూరల్: అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్న పోలీస్ కానిస్టేబుల్‌ౖపై దాడి చేసిన ఘటన మాన్విలో చోటు చేసుకుంది. సోమవారం మాన్వి తాలూకా చీకలపర్వి సమీపంలోని తుంగభద్ర నదీ తీరంలో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా దానిని నియంత్రించిన పోలీస్ కానిస్టేబుల్ లక్ష్మణ్‌పై దేవరాజ్ దాడి చేయడంతో గాయపడ్డాడు. గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ మాన్విలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన వారిపై మాన్వి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య తెలిపారు.
ఇళ్ల మంజూరుకు వినతి
రాయచూరు రూరల్: నగరంలో మురికి వాడల ప్రాంతాల్లో నివాసమున్న పేదల ఇళ్లకు ప్రమాణ పత్రాలను ఇచ్చి ఇళ్లను మంజూరు చేయాలని మురికి వాడల ప్రాంతాల క్రియా సేన సమితి అధ్యక్షుడు జనార్దన్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రూ.6 లక్షల్లో కేవలం స్లం బోర్డు అధికారులు రూ.3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. సగానికే చేపట్టిన నిర్మాణాల్లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయాలంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు.
ప్రోత్సాహం లేక
క్రీడాకారులు కనుమరుగు
కోలారు: జిల్లాలో క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేక ఎంతో మంది క్రీడాకారులు భవిష్యత్తు లేక కనుమరుగు అవుతున్నారని బెంగళూరు డీసీపీ డీ.దేవరాజ్ విచారం వ్యక్తం చేశారు. తాలూకాలోని తోరదేవండనహళ్లిలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్– 2025 టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడామైదానాలు, శిక్షకుల ఆవశ్యకత ఉందన్నారు. ఎంతో మంది శ్రీమంతులు, మధ్య తరగతికి చెందిన వారు తమ పిల్లలను క్రీడల్లో చేర్పించడానికి బెంగళూరుకు వెళుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువకులకు సరైన ప్రోత్సాహం లేక వెనకడుగు వేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామ పంచాయతీలో పలు క్రీడలకు క్రీడామైదానాల నిర్మాణానికి ఉన్న అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో పలు సంవత్సరాల క్రితం కొంతమంది రంజీ పోటీల్లో పాల్గొన్నారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో ఆడలేదనే అసంతృప్తి మిగిలిందన్నారు. ప్రస్తుతం కోరగండనహళ్లిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగడంతో క్రికెట్‌పై ఆసక్తి కలిగిన యువకులు ఈ స్టేడియాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరదేనహళ్లి వెంకటేష్, కిలారిపేట మణి, ముక్కడ్ వెంకటేష్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టరూ
రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టరూ
Comments
Please login to add a commentAdd a comment