మౌలిక సౌకర్యాల కోసం ధర్నా
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గ్రామస్తులు ఆందోళన జరిపారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద శావంతగేర ప్రజలు మాట్లాడారు. ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జెడ్పీ, టీపీ, జీపీ ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. గ్రామాల్లో తాగునీరు, రహదారుల మరమ్మతు, మురికి కాలువల నిర్మాణాలు, మహిళా మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
కార్మికుల సమస్యలు
పరిష్కరించండి
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హట్టి బంగారు గనుల కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ కార్యకర్తలు డిమాండ్ చేశారు. సోమవారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయంలో ఎండీకి వినతిపత్రం సమర్పించిన అనంతరం అధ్యక్షుడు ఫక్రుద్దీన్ మాట్లాడారు. కార్మికులకు వైద్య పరీక్షలు చేపట్టాలని, 2020–21వ సంవత్సరపు పీఎల్‌బీ పరిహారం అందించాలన్నారు. 2023 నుంచి కార్మికులకు పదోన్నతి కల్పించాలన్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న నర్సులను పర్మినెంట్ చేయాలని ఒత్తిడి చేశారు. ఆందోళనలో వెంకటేష్, శఫీ, అల్లాభకాష్,శ్రీధర్‌లున్నారు.
సీ్త్రలకూ సమాన హక్కులు
రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణం కోసం పురుషులతో పాటు సీ్త్రలకు కూడా సమాన హక్కులు ఉన్నాయని మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పారా మెడికల్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. మహిళల హక్కులు, విధులు, సమానత్వం, విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలుందన్నారు. మహిళల స్వేచ్ఛకు హద్దులుండాలన్నారు. కార్యక్రమంలో తిమ్మరాజ్, దండెప్ప, బాబురావ్, చంద్రశేఖర్‌లున్నారు.
మౌలిక సౌకర్యాల కోసం ధర్నా
మౌలిక సౌకర్యాల కోసం ధర్నా
Comments
Please login to add a commentAdd a comment