విద్యార్థులకు బ్యాగ్‌ల పంపిణీ
కోలారు : బెంగళూరు మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో సోమవారం తాలూకాలోని మాగొండి క్లస్టర్ పరిధిలోని పాఠశాలల్లోని 1000 మంది విద్యార్థులకు ఉచితంగా బ్యాగ్‌లను అందించారు. ఈ సందర్భంగా మంచ్ అధ్యక్షుడు స్నేహకుమార్ జాజూ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ద్వారా తల్లిదండ్రులను ప్రైవేటు పాఠశాలల వ్యామోహం నుంచి బయటకు తీసుకు రావాలన్నారు. విద్య సాధకుల సొత్తు అని నిరూపించాలన్నారు,. దాతలు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యా ప్రగతి సాధించాలన్నారు. విద్యార్థులు సమాజం, దేశానికి అమూల్యమైన సేవలను అందించాలన్నారు. తోటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాష్ మాండోత్, ఉపాధ్యాయ గెళెయర బళగ అధ్యక్షుడు నారాయణస్వామి, ఉపాధ్యక్షుడు వీరణ్ణగౌడ, తదితరులు పాల్గొన్నారు.
రత్నాచార్య అవార్డు ప్రదానం
కోలారు: కోలారమ్మ ఆలయ అర్చకుడు, జిల్లా అర్చకుల సంఘం అధ్యక్షుడు సి.సోమశేఖర్ దీక్షిత్‌కు జాతీయ రత్నాచార్య అవార్డు, డాక్టర్ ఆఫ్ ఓరియంటల్ లర్నింగ్ ఆన్ ధర్మశాస్త్ర డాక్టరేట్ అవార్డు లభించింది. ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటెడ్ జ్యోతిష్య విద్యా పీఠం, విశ్వ సంస్కృత మహావిద్యాలయం కోల్‌కతా చిత్తరంజన్ అవిన్యూ మహా జత్తి సదన్ ఆడిటోరియంలో నిర్వహించిన డాక్టరేట్ ప్రదానోత్సవంలో సోమశేఖర్ దీక్షిత్‌కు ఈ అవార్డును అందించారు. కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హెరిటేజ్ అధ్యక్షుడు డాక్టర్ గోపాలశాస్త్రి, కార్యదర్శి అమల కృష్ణ, ఉపాధ్యక్షుడు రవీంద్ర భట్టాచార్య, చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, అఖిల కర్ణాటక అర్చకుల ఆగమికుల సంఘం ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎన్ దీక్షిత్ ఉన్నారు.
విద్యార్థులకు బ్యాగ్‌ల పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment