ప్రసన్నలక్ష్మిది హత్యే
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలోని వాసవినగర్‌లో నివాసముంటున్న ప్రసన్నలక్ష్మిని శనివారం రాత్రి కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. భర్త జంబన గౌడ ప్రతి రోజు మద్యం తాగి వచ్చి కుటుంబ సభ్యులతో కలసి నానా హింసలు పెట్టేవాడన్నారు. పైగా విడాకుల కోసం ఏడాది నుంచి గొడవ పడేవాడన్నారు. 2008లో వివాహం చేసుకున్న సమయంలో 25 తులాల బంగారం, రూ.2 లక్షల వరకట్నం ఇచ్చారన్నారు. అక్క కూతురిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో దానిని నిరాకరించడంతో అప్పటి నుంచి తమ కూతురిని చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిపారు. కుటుంబ కలహాలపై వారం రోజుల క్రితం ప్రసన్నలక్ష్మిద పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఏం జరిగిందో ఏమో గత రాత్రి ప్రసన్నలక్ష్మి శవంగా మారిందన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపూర్‌కు చెందిన ప్రసన్నలక్ష్మికి జంబనగౌడతో రాయచూరు గీతా మందిరంలో 2008లో పెళ్లి జరిగిందన్నారు. ప్రసన్నలక్ష్మిని హత్య చేసిన భర్త, అత్త, మామ, కుమార్తెలపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు.
కుటుంబ సభ్యులే చంపి ఆత్మహత్యగా చిత్రించారు
మృతురాలి తల్లిదండ్రులు, బంధువుల ఆరోపణ
Comments
Please login to add a commentAdd a comment