ఆ పార్టీల్లో మహిళలకు అవకాశం ఏదీ?
కోలారు : జేసీబీ(జేడీఎస్, కాంగ్రెస్, బీజేపీ) పార్టీ ల్లో మహిళలకు అవకాశం లేదు. అయితే కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్‌ఎస్) పార్టీ పలు ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత నిచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని టి.చెన్నయ్య రంగమందిరంలో మహిళా దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తండ్రి లేదా కుమారుడు రాజకీయాల్లో పెద్ద సాధన చేసి ఉంటే మాత్రమే అలాంటి ఇంటి ఆడపడచులకు జేసీబీ పార్టీల్లో అవకాశం ఉంటుందన్నారు. స్వతంత్ర ఆలోచనలు కలిగిన వారికి ఆ పార్టీల్లో స్థానం ఉండదన్నారు. ఆయా పార్టీల గాడ్ ఫాదర్లకు సేవలు అందించిన మహిళలకు ఆ పార్టీలో తగిన స్థానం ఇస్తారన్నారు. మహిళలకు తగిన అవకాశాలు కల్పించడానికి కేఆర్‌ఎస్ పార్టీ ఉత్తమ వాతావరణం కల్పించిందన్నారు. పార్టీలో మహిళలకు తగిన స్వాతంత్య్రం కల్పించామన్నారు. వారి యోగ్యతలకు అనుగుణంగా పార్టీలో టికెట్ ఇస్తారన్నారు. పోలీసుల నుంచి మహిళలకు తగిన రక్షణ లభించడం లేదన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపైనే పోలీస్ అధికారి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడు. రాష్ట్ర కార్యదర్శి ఇందిరా రెడ్డి మాట్లాడుతూ మహిళలు నేడు పోరుబాటలో పలు రంగాల్లో ఎంతో సాధన చేసిన వారున్నారు. మహిళలు ఇంటికి పరిమితం కాకుండా విపులంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ముందుకు రావాలన్నారు. ఇదే సమయంలో పలువురు మహిళా సాధకులను సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆశా వీరేష్, సమన్వయ కార్యదర్శి రంజనా, దీపా, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment