బీజేపీ నేత, ఎస్‌ఐ బాహాబాహీ
తుమకూరు: తుమకూరు జిల్లాలోని మధుగిరి బీజేపీ అధ్యక్షుడు హనుమంతేగౌడ, ఎస్‌ఐ గాదిలింగప్ప ముష్టియుద్ధానికి దిగారు. నేనేం తక్కువ కాదని ఒకరికొకరు తోసుకుని కొట్టుకోవడంతో జనం ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చిత్రదుర్గం నగరంలోని ఐశ్వర్య హోటల్ ముందు జరిగింది. వివరాలు.. హనుమంతేగౌడ, మరికొందరితో కలిసి చిత్రదుర్గానికి వెళ్లాడు. భోజనం చేద్దామని హోటల్‌లోకి వెళ్తుండగా ఎస్‌ఐ గాదిలింగప్ప తనిఖీలకు వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని ఎస్‌ఐ ప్రశ్నించాడు. భోజనం చేయడానికి వచ్చామని హనుమంతేగౌడ అన్నారు. వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని ఎస్‌ఐ కాస్త గట్టిగా సూచించారు. మాకే బెదిరిస్తావా అని మద్యం మత్తులో ఉన్న హనుమంతేగౌడ ప్రశ్నించాడు. దీంతో ఎస్‌ఐ ఆయనను కొట్టాడు. నన్నే కొడతావా అని అతనిని కొట్టాడు. ఇద్దరూ దూషించుకుంటూ రచ్చ చేశారు. ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు హనుమంతేగౌడ మీద కేసు నమోదు చేశారు. బీజేపీ నాయకులు కలిసి ఎస్‌ఐపైన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చిత్రదుర్గ జిల్లా బీజేపీ ఎంపీ గోవింద కారజోళ, ఎమ్మెల్సీ చిదానంద గౌడ, కే.ఎస్.నవీన్‌గౌడ, తిప్పారెడ్డిలు ఎస్పీని కలిశారు. కాగా గొడవ వీడియోలు వ్యాప్తి చెందాయి.
చిత్రదుర్గంలో సంఘటన
ఎస్పీకి నాయకుల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment