రామనగర.. బెంగళూరు దక్షిణ కాలేదు!
దొడ్డబళ్లాపురం: నదులు, పర్వతాలతో ప్రకృతి అందాలకు నెలవు రామనగర జిల్లా. ఆ జిల్లాను బెంగళూరు దక్షిణ జిల్లాగా పేరు మార్చాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తహతహలాడుతున్నారు. కానీ ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. రామనగరను బెంగళూరులో విలీనం చేయాలనే శివకుమార్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ విషయంలో రెండు నెలల క్రితమే కేంద్ర హోం వ్యవహారాల శాఖ.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. బెంగళూరు దక్షిణ జిల్లాగా పేరు మార్పు గురించి స్థానిక ప్రజలలో వ్యతిరేకత ఉందని పేర్కొంది. ఆ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలిపింది.
కేంద్రం అనుమతి తప్పనిసరి కాదు: మంత్రి
కేంద్రం తిరస్కృతి నిజమేనని రెవెన్యూ మంత్రి క్రిష్ణభైరేగౌడ తెలిపారు. క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపించామన్నారు. జిల్లా పేరు మార్చాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి అయితే కాదని ఆయన అన్నారు. స్థానికులు, స్థానిక ఎమ్మెల్యేల వినతి మేరకు 2024లో క్యాబినెట్ జిల్లా పేరు మార్పుకు ఆమోదించినట్లు తెలిపారు. ఈ డిమాండు మొదట చేసింది డీకే శివకుమార్ అన్నారు. అభివృద్ధి దృష్టితో ఆయన ఈ ప్రస్తావన తీసుకువచ్చారన్నారు. రామనగర జిల్లాకు బెంగళూరు దక్షిణ జిల్లాగా పేరు మారిస్తే అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. పేరు మార్పును కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామితో పాటు బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు ప్రతిపక్షాల పంతమే గెలిచింది.
పేరు మార్పునకు కేంద్ర హోంశాఖ తిరస్కృతి
రాష్ట్ర సర్కారుకు లేఖ
రామనగర.. బెంగళూరు దక్షిణ కాలేదు!
Comments
Please login to add a commentAdd a comment