బెంగళూరులో ఇంటికి నిప్పు
సింగపూర్‌లో ప్రేమాయణం..
కృష్ణరాజపురం: ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే తప్పుడు మార్గంలో వెళ్లి చివరకు తల్లిదండ్రులనే సజీవ దహనం చేయాలనుకున్నాడో ప్రబుద్ధుడు. బెంగళూరు కేఆర్ పురం పరిధిలో హిరండహళ్లిలో ఇటీవల గ్రామ పంచాయతీ సభ్యుడు జగన్నాథ్ ఇంటికి నిప్పంటించిన కేసులో మిస్టరీ వీడింది. సొంత కొడుకే సైకోగా మారి వారిని చంపాలని ఈ పనికి పాల్పడినట్లు తెలిసి పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలు.. ఉన్నత విద్య కోసం సింగపూర్‌కు వెళ్లిన కుమారుడు (24) మలేషియాలో మరో మతానికి చెందిన వివాహిత మహిళతో ప్రేమాయణం సాగించాడు. ఆమె కోసం మతం కూడా మారినట్లు తెలిసింది. చదువుల ఖర్చుల కోసం తండ్రి రూ. 1 కోటి ఇవ్వగా, అందులో రూ. 40 లక్షల వరకూ ఆమెకు తగలేశాడు. ఇవన్నీ ఇంట్లో తెలిస్తే తనను మళ్లీ సింగపూర్‌కి వెళ్లనివ్వరు, తమ ప్రేమకు కూడా వ్యతిరేకిస్తారు అని అతడు ఆలోచించాడు. దీంతో తల్లిదండ్రులను హత్య చేయాలని కుట్ర పన్నాడు.
పెట్రోలు చల్లి నిప్పంటించి..
పథకం ప్రకారం సోమవారం రాత్రి రాంపుర పెట్రోల్ బంకుకు కారులో వెళ్లి ఐదు క్యాన్లలో పెట్రోల్ తెచ్చాడు. అందరూ గాఢనిద్రలో ఉండగా ఒక క్యాన్ పెట్రోల్‌ను తల్లిదండ్రులు నిద్రించిన గది కిటికీ తెరిచి పోసి నిప్పంటించాడు. మరొక క్యాన్ పెట్రోల్‌ను ఇంటి కాంపౌండ్ గోడపై పెట్టాడు. నిప్పంటించిన తర్వాత ఇంటిపై ఉన్న మరొక గదిలోకి వెళ్లాడు. ఎగసిపడుతున్న మంటలను చూసి భయపడి వెంటనే కిందకు వచ్చి ఏమీ తెలియనట్లు ఉండిపోయాడు. స్థానికులు, ఫైర్ సిబ్బంది వచ్చాక వారితో కలిసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఇంటిలోని సీసీ టీవీ డీవీఆర్‌ను ముందే తొలగించాడు. పోలీసులు ఆరోజు నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేయగా కొడుకు నిర్వాకమని నిర్ధారణ అయ్యింది. నిందితున్ని ఆవలహళ్లి పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కుమారుడు ఇతడే
తల్లిదండ్రులను చంపాలని కుట్ర
చదువుకోవడానికి వెళ్లి తప్పుదారి
ఘరానా కొడుకు నిర్వాకం
బెంగళూరులో ఇంటికి నిప్పు
బెంగళూరులో ఇంటికి నిప్పు
Comments
Please login to add a commentAdd a comment